మారన ఎఱ్రాప్రగడ:
ఎఱ్ఱాప్రగడ మహాభారతములో నన్నయ్య అసంపూర్ణముగా వదిలిన పర్వాన్ని(అరణ్య పర్వము) పూర్తి చేసినాడు. నన్నయ్య భారతాన్ని చదివి ఇతని భారతంలోని బాగం చదివితే ఇది నన్నయ్యే వ్రాసినాడా అనిపిస్తుంది, అలాగే తిక్కన్న భారతము చదివి ఎఱ్ఱాప్రగడ వ్రాసిన భారత భాగము చదివితే ఎఱ్ఱాప్రగడ భాగము కూడా తిక్కన్నే వ్రాసినాడా అనిపిస్తుంది.
ఎఱ్ఱాప్రగడ 14వ శతాబ్దములో రెడ్డి వంశమును స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానములో ఆస్థాన కవిగా ఉండేవాడు. ఏఅయనను ఎల్లాప్రగడ, ఎర్రన అనే పేర్లతో కూడ వ్యవహరిస్తారు. ఈయనకు "ప్రబంధ పరమేశ్వరుడు" అని బిరుదు కలదు.
ఎఱ్ఱాప్రగడ పాకనాడు సీమ (ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని భాగము) లోని గుడ్లూరు గ్రామములో జన్మించాడు. ఈయన ప్రస్తుత గుంటూరు జిల్లా వేమూరు మండలములోని చదలవాడ గ్రామములో నివసించినాడు. వీరు "శ్రీవత్స" గోత్రము "అపస్తంబు" శాఖకు చెందిన బాహ్మణుడు. అతని తండ్రి సుర్రన్న, తల్లి పొత్తమ్మ. ఎఱ్రన్నకు అతని తాత గారి నామధేయమయిన ఎఱ్రపొతన నామకరణం చేశారు అతని తల్లిదండ్రులు. ఎఱ్ఱాప్రగడ మామ్మ పేరు పేర్రమ్మ. ఎఱ్ఱాప్రగడ ముత్తాత ల పేర్లు బొలన మరియి పొలమ్మ. ఎఱ్ఱాప్రగడ కుటుంబ ఆరాధ్య దైవం శివుడు. గురువు గారి పేరు శ్రీశంకర స్వామి. ఎఱ్రన్న కుటుంబ ఆరాధ్య దైవం శివుడైనా విష్ణువుని కూడా పూజించేవాడు.
ఎఱ్ఱాప్రగడ కవిత్రయంలో మూడవ కవి, కాని ఆయన అనువదించినది మధ్య భాగము. నన్నయ మహాభారత అనువాదం అరణ్య పర్వం మధ్యలో ఆగిపోయింది. ఈ శేషభాగాన్ని అనువదించడానికి బహుశా మహాకవి తిక్కన వెనుకంజ వేశాడు. అలా మిగిలిపోయిన అరణ్య పర్వాన్ని తెలుగు లోకి ఎఱ్ఱన అనువదించాడు.
ఇంకా ఎఱ్ఱన హరివంశమును రచించి (అనువదించి) ప్రోలయ వేమారెడ్డికి అంకితమిచ్చాడు. నృసింహ పురాణము అనేది ఎఱ్ఱన స్వతంత్ర రచన. ఇది బ్రహ్మాండపురాణంలోని కధ ఆధారంగా వ్రాయబడింది.
27, జులై 2009, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 comments:
మూర్తిత్రయములో అఖరి వారే యీ యెర్రన్న, కాని ముగ్గురు దేవుళ్ళలో యెవరు చిన్న కాదే.
నమస్కారములు. మహాకవి
భాస్కరరావు బొల్లాప్రగడ (విశాఖ్పట్నం)
కామెంట్‌ను పోస్ట్ చేయండి