పొడుపు కథలు:
కిట కిట తలుపులు, కిటారి తలుపు, ఎప్పుడు తీసిన చప్పుడు కావు, ఏమిటవి?
విప్పితే: కనురెప్పలు!
అమ్మ అంటే కదులుతాయి, నాన్న అంటే కదలవు
జవాబు: పెదవులు
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది
విప్పితే: కవ్వము!
తెల్లటి బంతి చల్లని బంతి అందని బంతి ఆడని బంతి
జవాబు: జాబిలి
జవాబు: తేనె పట్టు
ఇల్లంతా తిరుగుతుంది, మూలన కూర్చుంటుంది
జవాబు: చీపురు
పిడికెడంత పిట్ట! అరిచి గోల చేస్తుంది. ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెబుతుంది.
జవాబు: టెలిఫోన్/సెల్ ఫోన్
మూడు కళ్ళ ముసలిదాన్నినేనెవరిని?
జవాబు:తాటి ముంజ
అడవిని పుట్టాను,నల్లగ మారాను:ఇంటికి వచ్చాను,ఎర్రగ మారాను:కుప్పలో పడ్డాను,తెల్లగ మారాను.
జవాబు:బొగ్గు
అడవిలో పుట్టింది,అడవిలో పెరిగింది:చెంబులో నీళ్ళని,చెడత్రాగుతుంది.
జవాబు:గంధపుచెక్క
అడవిలో పుట్టింది,అడవిలో పెరిగింది;మా ఇంటి కొచ్చింది,తైతక్కలాడింది.ఎవరు?
జవాబు : మజ్జిగను చిలికే తెడ్డు.
అన్నదమ్ములం ముగ్గురం మేము,శుభవేళల్లో కనిపిస్తూ వుంటాము:అయితే బుద్ధులు వేరు --నీళ్ళలోమునిగే వాడొకడు:తేలే వాడొకడు;కరిగే వాదొకడు:అయితే మే మెవరం?
జవాబు: ఆకు, వక్క, సున్నం.
అమ్మ కడుపున పడ్డాను,అంత సుఖమున్నాను:నీచే దెబ్బలు తిన్నను,నులువునా ఎండిపోయాను:నిప్పుల గుండం తొక్కాను:గుప్పెడు బూడిదనైనాను.
జవాబు:పిడక
ఆకసమంతా అల్లుకు రాగా:చేటెడు చెక్కులు చెక్కుకు రాగా:కడివెడు నీరు కారుకు రాగా:అందులో ఒక రాజు ఆడుతుంటాడు.
జవాబు: గానుగ
ఇంతింతాకు బ్రహ్మంతాకుపెద్దలు పెట్టిన పేరంటాకు.
జవాబు: మంగళ సూత్రం
ఇంతింతాకు ఇస్తరాకురాజులు మెచ్చిన రత్నాలాకు.
జవాబు: తామలపాకు.
ఊరంతకీ ఒక్కటే దుప్పటి
జవాబు: ఆకాశం
డబ్బా నిండ ముత్యాలు,డబ్బాకు తాళం. ఏమిటది ?
జవాబు: దానిమ్మ కాయ.
నీలము చీర, మధ్యలో వెన్న ముద్ద, అక్కడక్కడ అన్నపు మెతుకులు
జవాబు : ఆకాసములో చంద్రుడు, చుట్టూ నక్షత్రాలు
వ్రేలిమీద నుండు వెండుంగరము కాదు - వ్రేలిమీద నుండి నేలజూచుఅంబరమున దిరుగు నది యేమిచోద్యమో - విశ్వదాభిరామ వినురవేమ !
జవాబు : గాలిపటం
మూడు శిరములున్ను ముదమొప్ప పది కాళ్ళు - కల్గు తోకలు రెండు కన్ను లారుచెలగి కొమ్ములు నాల్గు చెతులు రెండయా - దీని భావమేమి తిరుమలేశ !
జవాబు: నాగలిదున్నే రైతు
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి