ఈ బ్లాగ్ రూపకర్త జె.రామాంజనేయులు(MCA)

30, జులై 2009, గురువారం

అరిసె:

అరిసె:
అరిసెలు తెలుగువారి అత్యంత ప్రీతిపాత్రమైన పిండివంటలలో ఒకటి. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు అరిసెలు తప్పనిసరి. పిన్నా పెద్దలు మిక్కిలి ఇష్టంతో అరిసెలను ఆరగిస్తారు.

తయారుచేయు విధానం:
  • బియ్యాన్ని నానబెట్టి, నానిన బియ్యాన్ని పిండి కొట్టి తయారుగా ఉంచుకోవాలి. అలాగే బెల్లాన్ని మెత్తగా తురిమి ఉంచుకోవాలి. తురిమిన బెల్లాన్ని పాకంగా తయారు చెయాలి. ఈ పాకంలో బియ్యపు పిండిని కలపి ముద్దగా చేయాలి. ఇలా తయారయిన ముద్దను చలిమిడి అంటారు. ఈ చలిమిడిని చిన్న చిన్న ఉండలుగా చేసి చేతితో వత్తి, వృత్తాకారంగా రూపొందించాలి. అలా వృత్తంగా తయారైన చలిమిడిని, బాణలిలో కాగుతున్న నెయ్యిలో వేయించాలి. దోరగా, బంగారు రంగుగా మారేంత వరకు వేయించి, వాటిని బయటకు తీసి అరిసెల గంటెలతో గట్టిగా వత్తి ఒక గంట ఆరబెట్టాలి. ఇవి చాలా రోజులవరకు నిల్వ ఉంటాయి.