ఈ బ్లాగ్ రూపకర్త జె.రామాంజనేయులు(MCA)

30, జులై 2009, గురువారం

గారె

గారెలు
నోరూరించే మసాలా వడ
గారెలు లేదా వడలు అనగానే ప్రతీ తెలుగు వారికి ఒక లోకోక్తి గుర్తుకు వస్తుంది. అది "తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి." అనేవారు. గారెలు తెలుగు వారికి అత్యంత ప్రీతి పాత్రమయిన వంటకములలో ఒకటి. దీనిని కొబ్బరి పచ్చడి తో గాని, వేరుశనగ పప్పు పచ్చడి తో గాని, శనగ పప్పు పచ్చడి తో గాని, అల్లం పచ్చడితో గాని జోడించి తింటే రుచి అమోఘంగా ఉంటుంది. కొందరు గారెలను బెల్లపు పాకంలో ముంచి మరికొద్దిరోజులు నిలువ ఉంచుతారు. ఇవి మరింత రుచికరంగా కూడా ఉంటాయి. తెలుగువారి ప్రతి పండుగకు ఈ వంటకము తప్పనిసరి. గారెలను తాలింపు వేసిన పెరుగులో నాన బెట్టి, పెరుగు గారెలను తయారు చెస్తారు. వీటిని ఆవడలు అంటారు. వీటి రుచి అమోఘం.
రకాలు
  • మినప గారెలు
  • పెసర గారెలు
  • చెక్క గారెలు
  • శనగ గారెలు
  • పెరుగు గారెలు
  • పాకం గారెలు
చిట్కాలు
గారెలు మరింత రుచిగా ఉండుటకు నూతనంగా కొన్ని మార్పులు చేస్తున్నారు.
  • మినుములతో పాటు కొద్దిగా బొబ్బర్లు, కొద్దిగా జీడిపప్పు, కొంత బంగాళాదుంప కలపడం జరుగుతుంది. వీటి కలయికతో గారె రుచి మరింత పెరుగుతుంది.