ఈ బ్లాగ్ రూపకర్త జె.రామాంజనేయులు(MCA)

27, జులై 2009, సోమవారం

పావులూరి మల్లన

పావులూరి మల్లన:
పావులూరి మల్లన తొలితరం తెలుగు కవి, గణితవేత్త. ఇతని కాలం స్పష్టంగా తెలియడంలేదు. ఇతను నన్నయ కాలంనాటివాడని, కాదు నన్నెచోడుని కాలం వాడని వాదాలున్నాయి. ఇతడు గణితసార సంగ్రహము అనె గణితగ్రంధాన్ని వ్రాశాడు. రాజరాజునుండి ఇతనికి నవఖండవాడ అగ్రహారం లభించిందట. తెలుగు పద్యానికి ఆరంభదశ అనుకొనే ఆ కాలంలోనే గణిత శాస్త్ర నియమాలను పద్యాలలో పొందుపరచడం సాధ్యమయ్యిందని ఇతని రచనల ద్వారాతెలుస్తున్నది.
ఇతనిదని చెప్పబడుతున్న ఒక పద్యం
శ్రీలలనేశు డాంధ్రనృపశేఖరుడై చను రాజరాజభూ-పలకుచేత బీఠపురి పార్శ్వమున న్నవఖండవాడ యన్బ్రోలు విభూతితో బడసి భూరిజనస్తుతుడైన సత్కళా-శీలుడ రాజపూజితుడ శివ్వన పుత్త్రుడ మల్లనాఖ్యుడన్

గోదావరి మండలంలో పావులూరు గ్రామానికి ఈ మల్లన్న కరణంగా ఉండేవాడట. ఇతడు మహావీరాచార్యులు రచించిన గణిత సార సంగ్రహాన్ని తెనిగించాడు. మూలం ఆ సంస్కృత గ్రంధం కావచ్చునుగాని లెక్కలన్నీ మల్లన్న స్వయంగా వేసుకొన్నవే. వ్యర్ధ పదాలు లేకుండా ఇంపైన పద్యాలలో శాస్త్రగ్రంధాన్ని ఇమడ్చడం ఇతని ప్రతిభకు సూచిక. ఇతని రచనలో కవిస్తుతి, పరిచయం వంటివి లేవు. ఇందులో ఒక పద్యం.
చెలికి షడంశమున్ బ్రియకు శేషము లోపలఁ పంచమాంశమున్బొలుపుగ దాని శేషమున బోదకు నాల్గవపాలునిచ్చి యందులఁ దన పాలు దాఁ గొనిపోయెఁ దొమ్మిది చేనలు రాజహంసమీనలిన మృణాళమెంత సుజనస్తుత మాకెఱుఁగంగఁ జెప్పవే
మల్లన్న వ్రాసిన ఈ క్రింది పద్యం వల్ల అప్పుడు జనం తర్క, వ్యాకరణ, గణిత, ఖగోళ, భూగోళ విషయాలలో ఆసక్తి కలిగి ఉండేవారని తెలుస్తున్నది.
అర్కాది గ్రహ సంచర గ్రహణ కాలాన్వేషణోపాయమునన్దర్క వ్యాకరణాగమాది బహుశాస్త్రప్రోక్త నానార్ధ సంపర్కాది వ్వవహారమునన్ భువనరూపద్వీప విస్తారమున్దర్కింపగన్ గణిత ప్రవృత్తి వెలిగా దక్కొండెరింగించునే?
విజ్ఞాన శాస్త్ర పఠనానికి గణితం చాలా ముఖ్యమనే విషయం ఈ పద్యంలో తెలియజెప్పబడింది.