ఈ బ్లాగ్ రూపకర్త జె.రామాంజనేయులు(MCA)

31, జులై 2009, శుక్రవారం

లడ్డు

లడ్డు:

లడ్డులు భారతదేశమంతా విరివిగా లభించే మిఠాయి. శనగ పిండిని చిన్నగా బూందీగా చేసి దానికి బెల్లపు పాకము గాని లేదా చక్కెర పాకము గాని చేర్చి గుండ్రటి ఆకారములో చేయబడు వాటిని లడ్డుగా పిలుస్తారు. బూందీని లడ్డూగా మార్చే ముందు వాటికి ఇంకా రుచి వచ్చేందుకు యాలక్కాయలు, కిస్మిస్[ఎండుద్రాక్షలు], జీడిపప్పు లాంటివి చేరుస్తారు.



కావలసిన పదార్ధాలు


  • శనగ పిండి - అరకిలో

  • చక్కెర - ఒక కిలో

  • నెయ్యి - ముప్పావు కిలో

  • జీడిపప్పు - 100 గ్రా.

  • ఎండుద్రాక్ష - 30 గ్రా.

  • ఏలకులు - 10 గ్రా.

  • పచ్చ కర్పూరం

  • కుంకుమ పువ్వు

  • మిఠాయి రంగు.

కావలసిన పరికరాలు

  • బూందీ చట్రాలు
  • బూరెల మూకుడు
  • రెండు వెడల్పాటి కళాయి గిన్నెలు

తయారుచేయు విధానం

  • శనగ పిండి ఒక కళాయి గిన్నెలో గరిటె జారుగా నీళ్ళు పోసి ఉండలు లేకుండా బాగా కలిసేటట్టుగా కలపాలి.
  • చక్కెరలో ఒక లీటరు నీళ్ళుపోసి ఆ గిన్నెను పొయ్యిమీద పెట్టి గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఈ పాకాన్ని వేళ్ళతో పట్టుకొని చేస్తే కొంచెం తీగరావాలి. దీనిని లేతపాకం అంటారు.
  • ఒక స్పూనులో పాలుపోసి, చిటికెడు మిఠాయిరంగు కలిపి, ఆ పాలు పాకంలో పోసి ఒక్కసారి తిప్పితే పాకానికి మిఠాయిరంగు వస్తుంది. తరువాత పాకం గిన్నెను దించి పక్కగా ఉంచుకోవాలి.
  • నెయ్యి బూరెలమూకుడులో పోసి మరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్ పండ్లు వేసి, వేయించి తీసి ఒక పక్కగా పెట్టుకోవాలి.
  • శనగ పిండి ముద్దని ఒక కప్పుతోగాని, గరిటెతో గాని తీసుకొని సన్నని రంధ్రాలు గలిగి లోతుగా ఉన్న చట్రంలో పొయ్యాలి. దానినుండి చిన్న చిన్న బిందువులుగా పెనంలో పడతాయి. అలా పెనం నిండా పడిన తరవాత చట్రం ముద్దలో ఉంచాలి.
  • బూందీ ఎరుపురంగుగా వేగకమునుపే, అనగా పసుపు పచ్చరంగులో ఉన్నప్పుడే మెరకగా ఉన్న రెండో చట్రంతో దేవి, పక్కనున్న పాకం గిన్నెలో వేయాలి; గరిటెతో కిందనుండి పైకి, పైనుండి కిందకి కలియబెట్టాలి.
  • బూందీ ఎరుపురంగుగా వేగకమునుపే, అనగా పసుపు పచ్చరంగులో ఉన్నప్పుడే మెరకగా ఉన్న రెండో చట్రంతో దేవి, పక్కనున్న పాకం గిన్నెలో వేయాలి; గరిటెతో కిందనుండి పైకి, పైనుండి కిందకి కలియబెట్టాలి.
  • శనగపిండి ముద్ద ఎక్కువగా ఉంటే ఇదే పద్ధతిని మళ్ళీ మళ్ళీ చెయ్యాలి.
  • బూందీ వెయ్యడం పూర్తయ్యాక వేయించి ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్ పండ్లు కూడా పాకంలో వెయ్యాలి.
  • తరువాత ఏలకుల పొడి, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం కలపాలి.
  • చల్లారిన తర్వాత కావలసినంత పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి. ఉండకడుతున్నప్పుడు విడిపోతున్నట్లు తోసిన, అరచేత్తో నొక్కినట్లయితే విడిపోవు. ఉండల్ని గాలి తగిలేటట్లుగా పదినిమిషాలు ఉంచాలి.

అప్పడాలు:

A stack of roasted papadums, ready to be served.

The papadum (for alternative names see box) is a thin Indian wafer, sometimes described as a cracker or flatbread.
An important part of Indian cuisine, recipes vary from region to region and family to family, but typically it is made from lentil, chickpea, black gram or rice flour. In North India, the lentil variety is more popular and is usually called 'papad'. Salt and peanut oil are added to make a dough, which can be flavored with seasonings such as chili, cumin, garlic or black pepper. Sometimes baking soda is also added. The dough is shaped into a thin, round flat bread and then dried (traditionally in the sun) and can be cooked by deep-frying, roasting over an open flame, toasting, or microwaving, depending on the desired texture.
Papadums are typically served as an accompaniment to a meal in India. It is also eaten as an appetizer or a snack and can be eaten with various toppings such as chopped onions, chutney or other dips and condiments. In certain parts of India, raw papadums (dried but unroasted) are used in curries and vegetable preparations. Papadums are made in different sizes. Smaller ones can be eaten like a snack chip and the larger ones can be used to make wraps.
Papad is often associated with the empowerment of women in India. Many individual and organized businesses run by women produce papad, pickles, and other snacks. This provides them regular income from minimal financial investments. Shri Mahila Griha Udyog Lijjat Papad is an organization solely run by women that produces large quantities of papadums on the open market. It started as a tiny, failing business in the late 1950s, and now has an annual income of over ௹3.15 billion, or just under $80 million US dollars.

Etymology
Papadum is a loan word from Tamil pappaṭām.Appadam is the word for papad in Telugu. In the Kannada language, common in the Dakshina Kannada district, a papad is referred to as a "happala," and is often made with black gram, jackfruit, and sabudana. The word papad occurs in a Hindi tongue twister - "Kachaa paapad, Pakaa paapad" (raw papad, fried/roasted papad), something similar to "Good blood, Bad blood".

30, జులై 2009, గురువారం

దద్ధ్యోదనం:

దద్ధ్యోదనం:
దద్ధ్యోదనం పెరుగు మరియు అన్నంతో చేసే రుచికరమైన ఆహారం. దీనిని వాడుకలో 'దద్ధోజనం' అనడం కూడా కద్దు.
కావలసిన పదార్ధాలు
బియ్యం - పావుకిలో
పెరుగు - అరలీటరు
పాలు - అరలీటరు
పచ్చిమిరపకాయలు - తగినన్ని
అల్లం - కొంచెం
కొత్తిమిర - కట్ట
కరివేపాకు - గుప్పెడు
నెయ్యి - చిన్న గిన్నెడు
పోపు సామానులు
జీడిపప్పు
పసుపు - చిటికెడు
తయారుచేయు విధానం
  • బియ్యం శుభ్రంగా బాగుచేసి, చక్కగా కడిగి, తరువాత 'అత్తెసరు' పెట్టాలి. అత్తెసరంటే గిన్నెలో బియ్యంపోసి తగినంత నీరు (అంటే వార్చకుండా అన్నం ఉడికేపాటి నీరు) పొయ్యాలి.
  • ఇలా ఉడికిన అన్నాన్ని ఒక కళాయి పళ్ళెంలోకి తిరగబోసుకుని తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. ఆ అన్నం బాగా చల్లారేటట్లు విడిగా ఆరనివ్వాలి.
  • పాలు రెండు పొంగులు రానిచ్చి దించి, చల్లారనివ్వాలి. ఈ చల్లారిన పాలు పెరుగులో పోసెయ్యాలి.
  • పచ్చి మిరపకాయలు, అల్లం సన్నగ తరిగి ముక్కలుచేసి ఉంచుకోవాలి.
  • ఒక గిన్నెలోగాని, బూరెల మూకుడులోగాని నెయ్యివేసి, నెయ్యి మరిగాక జీడిపప్పు, రెండు ఎండు మిరపకాయలు, కాస్త మినప పప్పు వెయ్యాలి. ఈ రెండు కాస్త ఎర్రబడ్డాక, రెండు మెంతిగింజలు, కాసిని ఆవాలు, జీలకర్ర, ఇంగువ పొడుం వేసి చిటపటలాడాక, పచ్చిమిరప, అల్లం ముక్కలువేసి, కరివేపాకు దూసివేసి కాస్త వేగాక పోపుగిన్నెకిందికి దింపి ఆ పోపుని పాలు, పెరుగు పోసి బాగా కలపాలి.
  • పాలు, అన్నం బాగా చల్లారిన తరువాత బాగా చేతితో నాలుగువైపులా కలిసేటట్లు కలపండి.
  • చివరికి కొత్తిమిర తుంచి వేయండి.

చిట్కాలు

  • అన్నం వేడిగా ఉండగా కలిపినా, వేడిపాలలో పెరుగు కలిపినా పెరుగు విరిగిపోతుంది.

పాయసము:

పాయసము:
పాయసం బియ్యం లేదా సేమియాలతో చేయబడు ఒక వంటకం. పాలను బాగుగా కాచి వాటిలో ముందుగా సిద్దం చేయబడిన బియ్యం/సేమియా, జీడిపప్పూ, యాలకులు, మెదలగునవి వేసి మరింత మరగబెట్టాలి. బియ్యం/సేమియా ఉడికే వరకూ మరగనిచ్చి ఆఖరులో తగినంత చక్కెర వెయ్యాలి. ఇలా పాయసం తయారగును. ఇది సామాన్యంగా, ప్రతి చిన్న సంధర్భంలోనూ ప్రతి వారూ తయారు చేసుకొనే వంటకం. తొందరగా తయారవడం, ఎక్కువమంది స్వీకరించగలిగే వీలు ఉండటం ఈ వంటకం ప్రత్యేకతలు.

పులిహోర:


పెళ్ళిళ్ళకు అత్యధికంగా చేయబడే వంటకం పులిహోర. దీనిని తయారీకి ముందుగా చింతపండు పులుసును మిర్చి, అల్లం, వేరుశనగ గింజలు, మినుములు, పచ్చి శనగపప్పు, లాంటి పోపు పదార్ధాలను నూనెలో వేయించి తాలింపుగా మార్చి ఆ మిశ్రమాన్ని పక్కగా ఉంచాలి. వేడిగా వార్చిన అన్నాన్ని ముందుగా సిద్దం చేయబడిన చింతపండు పులుసును బాగా కలపాలి. దానితో అది పసుపు వర్ణంలోకి మారిన పులిహోరగా తయారవుతుంది. దీనికి మరింత రుచి కొరకు నిమ్మకాయల రసం పిండుకొంటారు. ఈ వంటకం తెలుగు వారి శుభకార్యక్రమములలో సర్వసాదారణంగా కనిపిస్తుంది.
ఇతర విషయాలు
  • చాలా ఇళ్ళల్లో అన్నం మిగిలిపోయినపుడు ఇలా పులిహూరగా మార్చడం పరిపాటి.

బొబ్బట్టు:

బొబ్బట్టు:

బొబ్బట్లు తెలుగువారు పండగలలో చేసుకునే ఒక తీపి పిండివంట. పూజలలో కూడా అంటే వరలక్ష్మీ వ్రతం మెదలయిన పూజలలో కూడా చేసి అమ్మవారికి నైవేద్యంగా కూడా సమర్పిస్తారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి.

కావలసిన పదార్ధాలు

  • మైదా పిండి
  • శనగపప్పు
  • పంచదార
  • ఏలకలు తగినన్ని

తయారుచేయు విధానం

  • మైదాపిండిని కొద్దిగా నూని, ఉప్పూ వేసి, నీళ్ళు పోసి చపాతీ పిండిలాగ కలుపుకొని, మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి.
  • శనగపప్పును ఎక్కువగా కాకుండా తగినంత మాత్రమే అంటే సరిగ్గా ఉడకడానికి సరిపోయినంత నీరుపోసి కుక్కరులో ఉడికించాలి. దానిలో పంచదార వేసి గ్రైండు చేయాలి. దీనిలో ఏలకుపొడి కూడా వేస్తారు. ఈ ముద్దను చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు కలిపి పెట్టుకున్న మైదాపిండి నుండి చిన్న ఉండను తీసుకొని. చేతికి నూని రాసుకొని, మైదాపిండి ఉండను అరచేతిలో ఉంచుకొని కొద్దిగా చేతితోనే రొట్టిలా సాగదీసి, అందులో శనగపప్పు-పంచదార ముద్దను పెట్టి పూర్తిగా మూసివేయాలి. ఎక్కడా లోపల ఉన్న ముద్ద కనబడకుండా జాగ్రత్తగా మూయాలి.
  • ఇప్పుడు అరటి ఆకుమీదకానీ, లేకపోతే పాలకవరుమీదకానీ, ఏదైనా దళసరి కవరుమీదైనా సరే, నూని రాసి, ఈ తయారుచేసుకున్న ఉండను చేతితోనే గుండ్రంగా వచ్చేలా రొట్టెలాగ కొంచెం లావుగానే వత్తుకోవాలి. లోపలపెట్టిన తీపి పదార్ధం బయటకు రాకుండా వత్తుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి అది వేడెక్కాక, కొద్దిగానూని రాసి, ఆకుమీద తయారుచేసుకున్న రొట్టెను, అలాగే ఆకుతోనే తీసి పెనంమీద రొట్టె పడేటట్లు, పైవైపుకు ఆకు వచ్చేటట్లు వేసి, మెల్లగా ఆకును తీసివేయాలి.
  • రొట్టెకు చుట్టూ నూనికాని, నెయ్యిగానీ వేస్తూ, చపాతీలాగానే తిరగవేస్తూ, సన్నపు మంటమీద రెండు ప్రక్కలా ఎర్రగా కాల్చాలి.
  • ఈ బొబ్బట్లను నెయ్యిరాసుకుని, వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.

ఈ బొబ్బట్టునే కర్నూల్ వైపు వారు, తక్కువ నూని వేసి, తీపి రొట్టెలలాగ చేస్తారు. ఈ కాలంలో ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచిస్తూ, నెయ్యి నూనెలు వాడకం తగ్గిస్తున్నారు కనుక ఈ విధంగా చేయడం కూడా బాగుంటుంది. ఈ విధంగా చేసేటప్పుడు, వత్తడానికి పిండినే ఉపయేగిస్తారు. మామూలుగా చపాతీ వత్తినట్లే వత్తుతారు. ఇవి చాలా పెద్దవిగానూ వీలైనంత పల్చగానూ (సన్నగా) ఉంటాయి. నూని, నెయ్యి ఎక్కువగా ఉండవు కనుక, వీనిని పాలల్లో కూడా వేసుకుని తింటారు. వీనిని తెలుగువారే కాక ఈ విధంగా మహారాష్ట వారు కూడా చేస్తారు.

పకోడీ:

పకోడీ:
కావలసిన పదార్ధాలు
శనగ పిండి - తగినంత
బియ్యం పిండి - కొంచెం
ఉల్లిపాయ ముక్కలు - కొన్ని
పచ్చి మిరపకాయలు
అల్లం ముక్కలు

తయారుచేయు విధానం
తగినంత శనగపిండి, కొంచెం బియ్యం పిండి, ఉప్పు, అల్లం, పచ్చి మిరపకాయ ముక్కలు కొద్దిగా నీరు చిలకరించి గట్టిగా కలపాలి.
ఇది బాగా పిసికి మరుగుతున్న నూనెలో వేయించాలి.

చిట్కాలు
పకోడీ కరకరలాడుతూ గట్టిగా ఉండాలంటే నీరు చాలా తక్కువ వెయ్యాలి లేదా అసలు వెయ్యకూడదు. బియ్యం పిండి తప్పకుండా కలపాలి.
పకోడీ మెత్తగా, గుల్లగా ఉండాలంటే బియ్యం వెయ్యకుండా, కొద్దిగా వంటసోడా కలపాలి.

పకోడీలు రకాలు
గట్టి పకోడి:
మెత్తని పకోడి:
ఉల్లి పకోడీ:

జంతిక:

కరకరలాడే జంతికలు
అంధ్రదేశంలో విరివిగా వాడే ఒకరకమైన పిండి వంట జంతికలు. కేవలం పండుగలకు మత్రమే కాక మామూలు సమయాలలోనూ వండుకొనే ప్రసిద్ద వంటకం జంతిక. తెలంగాణా ప్రాంతంలో వీటినే మురుకులు అని వ్యవహరిస్తారు. ఇవి దేశవ్యాప్తంగానూ, భారతీయులు అధికంగా కల దేశాలలోనూ విరివిగా లభ్యమగును.
తయారుచేయు విధానం
  • వరి పిండిని ముద్దగా చేసి దానికి తగిన ఉప్పు కావలసిన దినుసులు చేర్చి గుండ్రంగా తిరుగుతూ పిండిని సన్న దారాలుగా మార్చే ఒక సాధనానికి గల ఖాళీలో ఆ ముద్దను వేసి నొక్కుతూ కావలసిన ఆకారాలలో మరిగే నూనెలో వదులుతూ జంతికలను తయారు చేస్తారు. పిల్లలు అధికంగా కల ఇళ్ళలోనూ, వర్షాకాలంలోనూ ఎక్కువగా తయారు చేస్తుంటారు. కరకరలాడుతూ, కారంకారంగా, ఉప్పుప్పగా, ఎక్కువకాలం నిలువ ఉండటం వలన ఈ వంటకం ప్రతి ఇంట్లోనూ తప్పని సరిగా కనిపిస్తుంది

కజ్జికాయ:


కజ్జికాయ:
కజ్జికాయలు భారతదేశమున లభ్యమయ్యే ఒకరకమైన మిఠాయిలు.
తయారీ విధానము
వీటి తయారీ విధానములో మొదటిది.
  • కొబ్బరిని కోరి దానికి బెల్లపుపాకమును చేర్చిన మిశ్రమమును ఉండలుగాచేసి ఉంచుతారు. తరువాత గోదుమ పిండిని మెత్తగా నీళ్ళతో కలపి బాగుగా పిసికి చిన్న చిన్న ఉండలుగా చేసి వాటిని గుండ్రముగా ఉత్తరాదిన చేయబడే పరోటా మాదిరిగా చేస్తారు. గుండ్రముగా ఉండే దాని మధ్య ముందుగా సిద్దము చేసుకొన్న కొబ్బరి కోరు ఉంచి ఉంచి రెండు వైపులా సగానికి మడిచి కొబ్బరికోరు బయటకు రాకుండా అంచులను దగ్గరగా మూసివేస్తారు. అలా చేయబడ్డ అర్ధ చంద్రాకారపు కజ్జికాయలను బాగ మరిగే నూనెలో మంచి బంగారపు రంగు వచ్చేవరకూ వేయిస్తారు. ఇవి పొడిగా ఉండి తినేందుకు అనువుగా ఉంటాయి.

రెండవది.
  • ఇదికూడా కొంతవరకూ పైమాదిరిగానే చేసి ఆఖరులో మాత్రం పంచదార పల్చని పాకంగా మార్చి వీటిని అందులో వేస్తారు. పాకం కారుతూ మెరుస్తూ ఉండే వెటిని తినేందుకు పాత్ర తప్పనిసరి.

అధికంగా వినియోగించు

  • ఇది కోస్తా ఆంధ్రప్రాంతములో విస్తారముగా లభ్యమగును. ప్రస్తుతం ప్రతి మిఠాయి దుకాణంలోనూ దొరకుతున్నవి.

రకాలు

కోవా కజ్జికాయలు

అరిసె:

అరిసె:
అరిసెలు తెలుగువారి అత్యంత ప్రీతిపాత్రమైన పిండివంటలలో ఒకటి. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు అరిసెలు తప్పనిసరి. పిన్నా పెద్దలు మిక్కిలి ఇష్టంతో అరిసెలను ఆరగిస్తారు.

తయారుచేయు విధానం:
  • బియ్యాన్ని నానబెట్టి, నానిన బియ్యాన్ని పిండి కొట్టి తయారుగా ఉంచుకోవాలి. అలాగే బెల్లాన్ని మెత్తగా తురిమి ఉంచుకోవాలి. తురిమిన బెల్లాన్ని పాకంగా తయారు చెయాలి. ఈ పాకంలో బియ్యపు పిండిని కలపి ముద్దగా చేయాలి. ఇలా తయారయిన ముద్దను చలిమిడి అంటారు. ఈ చలిమిడిని చిన్న చిన్న ఉండలుగా చేసి చేతితో వత్తి, వృత్తాకారంగా రూపొందించాలి. అలా వృత్తంగా తయారైన చలిమిడిని, బాణలిలో కాగుతున్న నెయ్యిలో వేయించాలి. దోరగా, బంగారు రంగుగా మారేంత వరకు వేయించి, వాటిని బయటకు తీసి అరిసెల గంటెలతో గట్టిగా వత్తి ఒక గంట ఆరబెట్టాలి. ఇవి చాలా రోజులవరకు నిల్వ ఉంటాయి.

సున్ని ఉండలు:

నోరూరించే సున్నిఉండలు
సున్ని ఉండలు:
సున్ని ఉండలు పోషక పదార్ధాలు అధికంగా కల మినుముల మరియు గోధుమల యొక్క మిశ్రమ మిఠాయిలు. ఆరోగ్యానికి ఆరోగ్యంగానూ, ఎక్కువకాలం నిలువఉండేందుకుగానూ మంచి మిఠాయిలుగా సున్ని ఉండలను పేర్కొంటారు.
తయారీ విధానం
  • మినుములను మరియు గోధుమలను వేయించి,మెత్తగా పిండి ఆడించుకొని ఆ మిశ్రమానికి పొడిగా చేసిన బెల్లమును కలిపి ఉంచుతారు. ఆ పొడిని బాణలిలో వేసి తగినంత నెయ్యి పోస్తూ వేడిచేస్తూ కలియబెడతారు. బాగా వేడి అయిన తరువాత దానిని గుండ్రటి ఉండలుగా చేతి పట్టుతో బిగిస్తూ పోతారు. ఆవిధంగా సున్ని ఉండలు సిద్దం.

వివిద ప్రాంతాలలో సున్ని ఉండలు
  • సున్ని ఉండలు కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాక ఇతరప్రాంతాలలో సైతం వాడుతారు. ఆంధ్రప్రాంతంలో అధికంగా వీటిని పెద్దపండుగగా వ్యవహరించే సంక్రాంతి కి ప్రతి ఇంట్లో చేస్తుంటారు.

పోక ఉండలు:

తియ్యని గట్టి పోక ఉండలు
పోక ఉండలు:
పోక ఉండలు లేదా పోకుండలు అనేది గుండ్రంగా ఉండే వంటకం. రసగుల్లా మాదిరిగా కనిపిస్తూ గట్టిగా ఉండే వంటకం. బియ్యపు పిండికి బెల్లపుపాకము చేర్చుట ద్వారా చలిమిడి అను ఒక రకమైన మిఠాయి తయారగును. ఈ చలిమిడి అని మిశ్రమమునకు వారి వారి ఇష్టాలననుసరించి నువ్వుపప్పు, బాధంపప్పు, జీడిపప్పు లాంటివి చేర్చుకొని దీనిని గుండ్రంగా చిన్నగా కావలసినచో చిన్నగా పెద్దగా కావలసినచో పెద్దగా గుండ్రటి ఆకారంలో చేసి మరిగే నూనెలో ముదురుగా ఎరుపునలుపుల మధ్యస్తమిశ్రమ రంగులో వేగిస్తారు. నూనె ఆరిన తరువాత గట్టీగా తీయగా ఏర్పడే మిఠాయిలను పోకుండలు అని పిలుస్తారు. ఇవి ఆంధ్రదేశంలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తాయి.

పూతరేకులు:

తీయనైన పూతరేకులు
పూతరేకులు:
పూతరేకులు ఆంధ్రప్రాంత అత్యంత ప్రసిద్ద మిఠాయిలు. పూతరేకులు చేయుట అనేది ఒక కళ. ఈ కళ కేవలం తూర్పు గోదావరి జిల్లా లోని కొన్ని ప్రాంతాలకే పరిమితం. తూర్పుగోదావరిలోని ఆత్రేయపురం మండలం గురించి మరేవిదంగా తెలియక పోయినా పూతరేకుల పరంగా ఈ మండలం బహుప్రసిద్దం. ఈ మండల పరిధిలోని గ్రామాలు పూతరేకుల తయారీతో కళ కళలాడుతుంటాయి. పూతరేకులు మరికొన్ని చోట్ల తయారు చేయబడుతున్నా వీరుమాత్రమే ఈ కళలో నిష్ట్ణాతులు. వీరి చేతిలోనే వాటి అసలు రుచి.
పుట్టు పూర్వోత్తరాలూ
పూతరేకుల పుట్టుక బహు విచిత్రం. ఒక వృద్దురాలు వంటచేసే సమయంలో ఆమెకు కలిగిన ఊహకు రూపం పూతరేకు. తదనంతరం దానిని మరింత అభివృద్ది పరచి ఎన్నో విధములైన పూతరేకులను సృష్టించారు.

కాజాలు:

కాజాలు:
కాజాలు ఆంధ్ర ప్రాంతంలో అత్యదికంగా విక్రయించబడే మిఠాయిలు మరియు శుభకార్యక్రమములలో విరివిగా వినియోగించబడే ప్రసిద్ద మిఠాయి. కాకినాడ ప్రాంతము కాజాల ద్వారానే బహు ప్రసిద్ది. పిండి ని పల్చగా సన్నటి పట్టీగా మార్చి దానిని గుండ్రంగా మడచి తరువాత ఒక వైపు కొంచెం నొక్కడంతో కాజా ఆకారం వస్తుంది. దీనిని నూనె లో బంగారపు రంగు వచ్చేవరకూ వేయించి తరువాత పంచదార పాకంలో ముంచి తీసి తయారు చేస్తారు. ఒక్క ఆంధ్రప్రాంతంలోనే కాక దేశవ్యాప్తంగా అన్ని చోట్లా లభ్యమగును.

రకాలు
  • మడత కాజా
  • కోటయ్య కాజా

గారె

గారెలు
నోరూరించే మసాలా వడ
గారెలు లేదా వడలు అనగానే ప్రతీ తెలుగు వారికి ఒక లోకోక్తి గుర్తుకు వస్తుంది. అది "తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి." అనేవారు. గారెలు తెలుగు వారికి అత్యంత ప్రీతి పాత్రమయిన వంటకములలో ఒకటి. దీనిని కొబ్బరి పచ్చడి తో గాని, వేరుశనగ పప్పు పచ్చడి తో గాని, శనగ పప్పు పచ్చడి తో గాని, అల్లం పచ్చడితో గాని జోడించి తింటే రుచి అమోఘంగా ఉంటుంది. కొందరు గారెలను బెల్లపు పాకంలో ముంచి మరికొద్దిరోజులు నిలువ ఉంచుతారు. ఇవి మరింత రుచికరంగా కూడా ఉంటాయి. తెలుగువారి ప్రతి పండుగకు ఈ వంటకము తప్పనిసరి. గారెలను తాలింపు వేసిన పెరుగులో నాన బెట్టి, పెరుగు గారెలను తయారు చెస్తారు. వీటిని ఆవడలు అంటారు. వీటి రుచి అమోఘం.
రకాలు
  • మినప గారెలు
  • పెసర గారెలు
  • చెక్క గారెలు
  • శనగ గారెలు
  • పెరుగు గారెలు
  • పాకం గారెలు
చిట్కాలు
గారెలు మరింత రుచిగా ఉండుటకు నూతనంగా కొన్ని మార్పులు చేస్తున్నారు.
  • మినుములతో పాటు కొద్దిగా బొబ్బర్లు, కొద్దిగా జీడిపప్పు, కొంత బంగాళాదుంప కలపడం జరుగుతుంది. వీటి కలయికతో గారె రుచి మరింత పెరుగుతుంది.

పూర్ణం బూరెలు:


పూర్ణం బూరెలు:

పూర్ణం బూరెలు లేదా కుడుం బూరెలు ఒక ప్రత్యేకమైన బూరెలు.


కావలసిన పదార్ధాలు


శనగ పప్పు - పావుకిలో
బెల్లం లేదా చక్కెర - పావుకిలో
మినప పప్పు - అర్ధాపావుకిలో
మెత్తని బియ్యం పిండి - పావుకిలో
ఎండు కొబ్బరి ముక్కలు
ఏలకులు - తగినన్ని


తయారుచేయు విధానం

  • బూరెలు వండడనికి మూడు గంటలు ముందుగా చోవి (బూరె పైన తొక్క కోసం) తయారుచేసుకోవాలి. దీనికోసం మినప పప్పు నానబెట్టి; గంటతర్వాత మెత్తని కాటుకలా రుబ్బి, ఆ రుబ్బినపిండిలో బియ్యపు పిండి పోసి కలిపి, చిటికెడు ఉప్పు వేసి గిన్నె మీద మూతపెట్టి ఉండనివ్వాలి. ఈ పిండిని కనీసం మూడు గంటలన్నా నానబెట్టాలి.
  • శనగ పప్పు తక్కువ నీరుపోసి బాగా ఉడకనివ్వాలి. పప్పు చేతితో పట్టుకొని నొక్కి సూస్తే చితికిపోవాలి. తర్వాత పప్పులో నీరుగనక ఉంటే వంచేసి తరిగిన బెల్లం లేక చక్కెర పోసి ఉడకనివ్వాలి. ఈ మాదిరిగా పాకం పెట్టడం వల్ల బూరెలు రెండురోజులున్నా చెడిపోవు.
  • ఏలకులు వొలిచి గింజలు పొడుంలాగా దంచుకోవాలి. కొబ్బరి సన్నంగా ముక్కలు తరిగి నేతిలో చేయించుకోవాలి.
  • పాకం గిన్నెలోని పప్పుని గరిటెతో బాగా కుమ్మి, అందులో ఏలకులపొడి, కొబ్బరిముక్కలు వేసి, నేతితో బాగా కలిసేటట్లు పిసికి, తరువాత నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి.
  • పొయ్యిమీద బూరెల మూకుడు పెట్టి, నూనె మరిగాక, ఒక్కొక్క పూర్ణపు ఉండ సిద్ధంగా ఉంచుకున్న చోవిలో ముంచి, నూనెలోవేసి, ఎర్రగా వేగాక తీసి విడిగా పెట్టుకోవాలి. బూరెచోవి మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు.
చిట్కాలు
బూరె చోవిలో బియ్యం పిండి ఎక్కువ కలిపితే, వేగాక బూరెలు పైన కరకరలాడుతూ ఉంటాయి. మినప పిండి ఎక్కువ కలిపితే చల్లారిన తర్వాత మెత్తబడి సాగుతాయి.

పొడుపు కథలు:

పొడుపు కథలు:

కిట కిట తలుపులు, కిటారి తలుపు, ఎప్పుడు తీసిన చప్పుడు కావు, ఏమిటవి?
విప్పితే: కనురెప్పలు!

మామ కాని మామ, ఎవ్వరది?
విప్పితే: చందమామ!

చుట్టింటికి మొత్తే లేదు
జవాబు: కోడి గుడ్డు

నల్ల బండ క్రింద నలుగురు దొంగలు
జవాబు: బర్రె(గేదె, ఎనుము) క్రింది పొదుగులు

అమ్మ అంటే కదులుతాయి, నాన్న అంటే కదలవు
జవాబు: పెదవులు

అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది
విప్పితే: కవ్వము!

తెల్లటి బంతి చల్లని బంతి అందని బంతి ఆడని బంతి
జవాబు: జాబిలి

దేశదేశాలకు ఇద్దరే రాజులు
జవాబు: సూర్యుడు, చంద్రుడు

చిటారు కొమ్మన మిటాయి పొట్లం
జవాబు: తేనెపట్టు

తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది
జవాబు: ఉత్తరంజాబులేఖ

ఆకాశాన అంబు, అంబులో చెంబు, చెంబులో చారెడు నీళ్ళు
జవాబు: టెంకాయ

అరచెయ్యంత పట్నంలో అరవై గదులు; గదికొక్క సిపాయి; సిపాయికొక్క తుపాకీ
జవాబు: తేనె పట్టు

తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు: చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు
జవాబు: పుస్తకంలో అక్షరాలు

వంరి వంకల రాజు, వళ్ళంతా బొచ్చు
జవాబు: పొలం గట్టు

ఇల్లంతా తిరుగుతుంది, మూలన కూర్చుంటుంది
జవాబు: చీపురు

పిడికెడంత పిట్ట! అరిచి గోల చేస్తుంది. ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెబుతుంది.
జవాబు: టెలిఫోన్/సెల్ ఫోన్

మేసేది కాసంత మేత:కూసేది కొండంత మోత.
జవాబు:తుపాకి/తూట (़़़़)

మూడు కళ్ళ ముసలిదాన్నినేనెవరిని?
జవాబు:తాటి ముంజ

బంగారు భరిణలో రత్నాలు:పగుల గొడితేగాని రావు.
జవాబు:దానిమ్మ పండు.

పొంచిన దెయ్యం పోయిన చోటికల్లా వస్తుంది?
జవాబు:తన నీడ

మంచం కింద మామయ్యా:,ఊరికి పోదాం రావయ్య.
జవాబు:చెప్పులు

పలుకుగాని పలుకు :ఎమిటది?
జవాబు:వక్క పలుకు

నల్లని చేనులోతెల్లని దారి ఏమిటది?
జవాబు:పాపిడి.

పచ్చ పచ్చని తల్లి:పసిడి పిల్లల తల్లి:తల్లిని చీలిస్తేతియ్యని పిల్లలు
జవాబు:పనస పండు

పచ్చన్ని పొదలోన విచ్చుకోనుంది:తెచ్చుకోబోతేను గుచ్చుకుంటుంది. ఏమిటది?
జవాబు:మొగలి పువ్వు

నోరులేని పిట్ట తోకతో నీళ్ళు తాగుతుంది.ఏమిటది?
జవాబు:దీపం వత్తి

అక్కడిక్కడి బండి అంతరాల బండి:మద్దూరి సంతలోన మాయమైన బండి.ఏమిటది?
జవాబు:సూర్యుడు.

అడవిని పుట్టాను,నల్లగ మారాను:ఇంటికి వచ్చాను,ఎర్రగ మారాను:కుప్పలో పడ్డాను,తెల్లగ మారాను.
జవాబు:బొగ్గు

అడవిలో పుట్టింది,అడవిలో పెరిగింది:చెంబులో నీళ్ళని,చెడత్రాగుతుంది.
జవాబు:గంధపుచెక్క

అడవిలో పుట్టింది,అడవిలో పెరిగింది;మా ఇంటి కొచ్చింది మహలక్ష్మి.ఎవరు ?
జవాబు:గడప ====
అడవిలో పుట్టింది,అడవిలో పెరిగింది;మా ఇంటి కొచ్చింది,తైతక్కలాడింది.ఎవరు?
జవాబు : మజ్జిగను చిలికే తెడ్డు.

అన్నదమ్ములం ముగ్గురం మేము,శుభవేళల్లో కనిపిస్తూ వుంటాము:అయితే బుద్ధులు వేరు --నీళ్ళలోమునిగే వాడొకడు:తేలే వాడొకడు;కరిగే వాదొకడు:అయితే మే మెవరం?
జవాబు: ఆకు, వక్క, సున్నం.

అమ్మ కడుపున పడ్డాను,అంత సుఖమున్నాను:నీచే దెబ్బలు తిన్నను,నులువునా ఎండిపోయాను:నిప్పుల గుండం తొక్కాను:గుప్పెడు బూడిదనైనాను.
జవాబు:పిడక

ఆకసమంతా అల్లుకు రాగా:చేటెడు చెక్కులు చెక్కుకు రాగా:కడివెడు నీరు కారుకు రాగా:అందులో ఒక రాజు ఆడుతుంటాడు.
జవాబు: గానుగ

ఆకాశ పక్షి ఎగురుతూ వచ్చి,కడుపులో చొచ్చి లేపింది పిచ్చి.
జవాబు:కల్లు

ఆమడ నడిచి అల్లుడొస్తే,మంచం కింద ఇద్దరూ,గోడ మూల ఒకరూ,దాగుకున్నారు.
జవాబు: చెప్పుల జోడు, చేతి కర్ర

ఇంతింతాకు బ్రహ్మంతాకుపెద్దలు పెట్టిన పేరంటాకు.
జవాబు: మంగళ సూత్రం

ఇంతింతాకు ఇస్తరాకురాజులు మెచ్చిన రత్నాలాకు.
జవాబు: తామలపాకు.

ఇక్కడి నుంచి చూస్తే యినుము;దగ్గరికి పోతే గుండు;పట్టి చూస్తే పండు;తింటే తీయగనుండు.
జవాబు: తాటిపండు.

ఊరంతకీ ఒక్కటే దుప్పటి
జవాబు: ఆకాశం

ఊరంతా నాకి మూల కూర్చుండేది - యేది?
జవాబు: చెప్పులు

ఇల్లంతా నాకి మూల కూర్చుండేది - యేది?
జవాబు: చీపురు

ఊళ్ళో కలి,వీధిలో కలి,ఇంట్లో కలి,ఒంట్లో కలి.
జవాబు: చాకలి, రోకలి, వాకలి, ఆకలి.

ఎక్కలేని మానుకి దుక్కిలేని కాపు.
జవాబు: మిరపచెట్టు.

ఏడుగురు అన్నదమ్ములం మేము;విడివిడిగా వుంటే చెప్పగలవు,కలసి వుంటే చెప్పలేవు.
జవాబు: ఇంద్రధనస్సు

తండ్రి గరగర,తల్లి పీచుపీచు,బిడ్డలు రత్నమాణిక్యాలు,మనుమలు బొమ్మరాళ్ళు.
జవాబు: పనసకాయ

గోడమీద బొమ్మగొలుసుల బొమ్మవచ్చి పోయే వారికివడ్డించు బొమ్మ.
జవాబు: తేలు.

చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు, వెయ్యని సున్నం తియ్యగ నుండు.
జవాబు: టెంకాయ .

ఇంతింత బండి - ఇనప కట్ల బండి , తొక్కితే నా బండి - తొంభై ఆమడలు పోతుంది.
జవాబు: సైకిలు
డబ్బా నిండ ముత్యాలు,డబ్బాకు తాళం. ఏమిటది ?
జవాబు: దానిమ్మ కాయ.

పళ్ళెంలో పక్షి - ముక్కుకు ముత్యం, తోకతో నీరు - త్రాగుతుంది మెల్లగా
జవాబు: దీపం

అయ్య అంటే కలవవు, అమ్మ అంటే కలుస్తాయి
జవాబు:పెదవులు

నీలము చీర, మధ్యలో వెన్న ముద్ద, అక్కడక్కడ అన్నపు మెతుకులు
జవాబు : ఆకాసములో చంద్రుడు, చుట్టూ నక్షత్రాలు

వ్రేలిమీద నుండు వెండుంగరము కాదు - వ్రేలిమీద నుండి నేలజూచుఅంబరమున దిరుగు నది యేమిచోద్యమో - విశ్వదాభిరామ వినురవేమ !
జవాబు : గాలిపటం

మూడు శిరములున్ను ముదమొప్ప పది కాళ్ళు - కల్గు తోకలు రెండు కన్ను లారుచెలగి కొమ్ములు నాల్గు చెతులు రెండయా - దీని భావమేమి తిరుమలేశ !
జవాబు: నాగలిదున్నే రైతు

Akkineni Nageswara Rao's Birudulu





New Page 2










































































S
No.





Birudu





Date





Presented at

1 Nata samrat August, 1957 Vijayawada
2 Nata Sarvabhouma 19-9-1965 Chitranjali
Kalakshetam, Bangalore
3 Nata Rajasekhara 14-1-1967 Telugu Darbar,
Eluru
4 Padma Sri 16-4-1967 by President
Jakir Hussian, New Delhi
5 Kala Prapoorna
Doctorate
26-2-1977 By JJ Diwan,
Governer of AP at Vizag
6 Kala Praveena 23-3-1977 Ravindra Bharati,
Hyderabad
7 Abinaya Navarasa
Sudhakara
12-8-1984 Telugu Sangeeta
Nataka Nritya Aikya Academy, Madras.
8 Kala Siromani 4-1-1987 Rajadhani Telugu
samskritika Samstalu, New Delhi
9 Padma Bhooshan 26-1-1988 by President R
Venkatraman at New Delhi
10 Abhinaya Kala
Prapoorna
22-10-1994 Washington DC
Civic Reception Committee




ANR:

First Talkie film of Telugu Cinema 'Bhakta Prahlada' was released in 1931. Akkineni Nageswara Rao's (ANR) first film was released in 1941. It shows that the Telugu Cinema followed him except for the first 10 years. Knowing about Dr. Akkineni is like reading the encyclopedia of Telugu Cinema.
There is only one era for Telugu cinema as for as the Telugu Cinema is concerned. That is called Akkineni era. He gave new dimensions to the dances with his variety steps and at one time, people used throng to theaters to see his magical steps in his musical blockbusters.
Akkineni's image is not restricted just to Andhra Pradesh alone. His characters do have Indian wide exposure. His 'Devdas' belongs to Bengali state, 'Kalidas' belongs to north, 'Tukaram' and 'Kora Gumbhara' belongs to Maha Rastra, 'Jayadeva' role belongs to Orissa and 'Kshetrayya' role belongs to Andhra Pradesh. By acting in films having background of various regions of India, he truly showed the national integrity and unity in diversity.
He is liberally graced with all the awards an actor can get. He is the recipient of Dada Saheb Phalke Award, the greatest honor for an actor in this country. He is also the recipient of Raghupati Venkayya Award, the best award for any actor at state level. He also grabbed the Kalidasu award granted by MP Government at national level. Not to mention the NTR National award given by our state government. He is recently been appointed as an adviser to the State Film Development Corporation. Though, it was an official position for ANR, he was voluntarily helping the film industry in various ways since ages. He was the first Telugu hero to migrate from Madras (now known as Chennai) to Hyderabad to develop film industry in AP. He laid the foundation stone for Hyderabad Telugu cinema by announcing that all his producers have to produce their films in AP, if ANR has to act in them. He gave a five-point plan to state government about how to improve the Telugu Cinema industry in AP in 1963.
Since there were no studios in AP at that time, ANR has put in his hard-earn money to build the glorious Annapurna studios. After seeing the deterioration in the number of films getting produced in AP, he incorporated an award for the best film to encourage the filmmakers. State Government is presenting Akkineni Nageswara Rao award every year. ANR never cared for commercial success when it comes to producing films on his own banner, Annapurna Pictures. He did two noble films, Sudi Gundalu and Maro Prapancham. These two films flopped as Andhra people couldn't appreciate them. Otherwise, there would have been more message-oriented films in the future.
Akkineni Nageswara Rao complete his 81st year today (20th September 2005).


Akkineni Nageswara Rao
Akkineni Nageswara Rao known as ANR. He is one of the first fully commercial Telugu Cinema heroes. His works includes mythological, folk tale, social, adventure and drama.He is also a recipient of the Padma Bhushan and Padma Shri. He is the first person to cause the shift of Telugu film industry to Andhra Pradesh from Chennai, Tamilnadu in an attempt to bring together the mother tongue of industry and industry itself. Soon after the move to Hyderabad, Nageswara Rao founded his own production house, Annapoorna Studios located in Banjara Hill.His younger son Nagarjuna is also an actor inTelugu and Hindi films.His elder son Venkat is taking care of Annapurna Studios. He is a film producer. Recently he acted in a film called "chukkallo chandrudu" with young hero Siddhardh.
He is specifically remembered in Andhra Pradesh for his biographical roles like Vipranarayana, Chakradhari, Tukaram, Kalidasu, Jayadeva, Tenali Ramakrishna, Kshethrayya etc. Moreover he is popular as hero of popular fiction (Novels) which were made into films e.g. Doctor Chakravarthi, Prema Nagar, Devadasu, Secretary etc.Date of Birth: September 20, 1923.Highest Award: Dadasaheb Phalke Award in 1990 for lifetime contribution to Indian cinema.Related: Akkineni Nageswrara Rao College, Gudiwada.
http://www.anrcollege.edu/

28, జులై 2009, మంగళవారం

తెలుగు ప్రముఖ కవులు

తెలుగు ప్రముఖ కవులు

చిలకమర్తి లక్ష్మీనరసింహం:


చిలకమర్తి లక్ష్మీనరసింహం:
చిలకమర్తి లక్ష్మీనరసింహం (Chilakamarthi Lakshmi Narasimham) (1867 - 1946) ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20 వశతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. ఈ నాటకంలో టంగుటూరి ప్రకాశం పంతులు అర్జునుడి వేషం వేసేడుట.

లక్ష్మీనరసింహం 1867 సెప్టెంబర్ 26 న పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలములోని ఖండవల్లి గ్రామములో ఒక బ్రాహ్మణ కుటుంబములో వెంకయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించాడు.

విద్య, బోధన
ఆయన ప్రాథమిక విద్య వీరవాసరం, నరసాపురం పట్టణాలలో సాగింది. 1889లో రాజమండ్రి హైస్కూలులో పట్టం చేత పట్టుకొన్నాడు. 1889లో రాజమండ్రి ఆర్య పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా చేరాడు. తరువాత ఇన్నీస్ పేట స్కూలులోనూ, మునిసిపల్ హైస్కూలులోనూ విద్యాబోధన సాగించాడు. తరువాత ఒక సంవత్సరం సరస్వతి పత్రిక సంపాదకునిగా పనిచేశాడు. ఆపై ఉద్యోగం విరమించి 1899లో హిందూ లోయర్ సెకండరీ స్కూల్ స్థాపించి 9 సంవత్సరాలు నడిపాడు. తరువాత ఈ పాఠశాల వీరేశలింగం హైస్కూల్ గా మార్చబడింది.
30వ ఏటనుండి రేచీకటి వ్యాధికి గురైనా ఆయన శ్రమించి తన కంటిచూపుకున్న అవరోధాన్ని అతిక్రమించి రచనలు కొనసాగించాడు. ఆయన రచనలు 10 సంపుటాలుగా ప్రచురింపబడ్డాయి. 1943లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను కళాప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది.
1946, జూన్ 17న లక్ష్మీనరసింహం మరణించాడు.


రచనా పరంపర
పాఠశాలలో ఉన్నపుడే పద్యాలు వ్రాయడం ప్రారంభించిన లక్ష్మీ నరసింహం ఎన్నో రచనలు చేశాడు. కీచక వధ ఆయన మొదటి నాటకం. తరువాత ద్రౌపదీ పరిణయం, గయోపాఖ్యానం, శ్రీరామ జననం, సీతా కళ్యాణం, పారిజాతాపహరణం వంటి నాటికలు రచించాడు. ఆయన వ్రాసిన నవలలో రామచంద్ర విజయం, హేమలత, అహల్యాబాయి, సుధా శరచ్చంద్రము ముఖ్యమైనవి. సరస్వతి పత్రిక సంపాదకునిగా ఉన్నపుడు సౌందర్య తిలక, పార్వతీ పరిణయం వ్రాశాడు. ఇంకా అనేక రచనలు చేశాడు.
1908లో ఒక ప్రెస్ స్థాపించాడు. 1916లో మనోరమ, పత్రిక అనే పత్రిక స్థాపించాడు. దీని ద్వారా గణపతి, రాజరత్నము, రఘుకుల చరిత్ర (కాళిదాసు రచన రఘువంశానికి అనువాదం), సిద్ధార్థ చరిత్ర వంటివి ప్రచురించాడు.

సంస్కరణ కార్యక్రమాలు
లక్ష్మీ నరసింహం మొదటి తరం సంఘ సంస్కర్త. 1909లో సామాజికంగా వెనుకబడిన వర్గాలకోసం ఒక పాఠశాల ప్రారంభించి 13 సంవత్సరాలు నడిపాడు. బ్రహ్మసమాజం, హితకారిణీ సమాజం వంటి సంస్కరణ దృక్పథం గల సంఘాల కార్యకలాపాలలో పాలు పంచుకొన్నాడు. దేశమాత అనే వారపత్రిక ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు వ్రాశాడు.
విశేషాలు
ఆయన మొదటి నాటకం కీచక వధ 1889 జూన్ 15 రాత్రి ప్రదర్శింపబడింది.
కలకత్తా బ్రహ్మసమాజం నాయకుడు పండిత శివానంద శాస్త్రి లోకల్ షేక్స్‌పియర్ అని లక్ష్మీనరసింహాన్ని ప్రశంసించాడు.
అనేక మార్లు ప్రదర్శింపబడిన గయోపాఖ్యానం నాటకం ప్రతులు లక్షకు పైగా అమ్ముడు పోయాయి. ఇప్పటికీ ఇది రికార్డు (సరి చూడాలి)
1894లో ఆయన రాసిన రామచంద్రవిజయం అనే సాంఘిక నవల న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి పొందింది. ఇది ఆయన ఆత్మకథ అంటారు.
కొద్దికాలం ఆయన అష్టావధానాలు చేశాడు.
1897లో వ్రాసిన పృథ్వీరాజీయం అనే గేయ సంపుటి వ్రాతప్రతి ప్రమాదవశాత్తు చిరిగి పోయింది కనుక ప్రచురణకు నోచుకోలేదు.
మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి రాకముందే చిలకమర్తి హరిజనులకోసం ఒక పాఠశాలను ఆరంభించాడు.
చిలకమర్తి గ్రహణ, ధారణ శక్తులు అమోఘం. వాసురాయకవి ఆయనది "ఫొటోజెనిక్ మెమరీ" అని వర్ణించాడు.
ఆయన మంచి వక్త. శ్రోతలను బాగా ఆకట్టుకొనేవాడు.
భారత జాతీయ కాంగ్రెసు కార్య కలాపాలలో ఆయన చురుకుగా పాల్గొనేవాడు.
ఆయన రచన గణపతి నవల హాస్యరచనలలో ఎన్నదగినది.

రచనలు
నాటకాలు
కీచక వధ -1889
ద్రౌపదీ పరిణయం -1889-1890
శ్రీరామ జననం -1889-1890
పారిజాతాపహరణం -1889-1890
సీతా కళ్యాణం -1889-1890
గయోపాఖ్యానం -1889-1890
నల చరిత్రం -1892
ప్రసన్నయాదవం - 1906 (ప్రదర్శింప బడింది, కాని ప్రచురింపబడలేదు)
నవనాటకము
నవలలు
రామచంద్ర విజయము - 1894 (ధారావాహిక)
హేమలత -1896 (చారిత్రిక నవల)
అహల్యాబాయి - 1897
సౌందర్య తిలక - 1898 - 1900
పార్వతీపరిణయము
గణపతి
కవితలు
పృథ్వీరాజీయము (అముద్రితం)
అనువాదాలు
పారిజాతాపహరణము (సంస్కృత నాటకం నుండి)
అభిషేక నాటకం (భాసుని సంస్కృత నాటకం నుండి)
స్వప్న వాసవదత్త (భాసుని సంస్కృత నాటకం నుండి)
మధ్యమ వ్యాయోగము (భాసునిసంస్కృత నాటకం నుండి)
ఋగ్వేదం (ఒక మండలం)
ధర్మ విజయం (పి. ఆనందాచార్యులు మహాభారత కథ ఆధారంగా అంగ్లంలో రచించిన నవల)
సుధా శరచ్చంద్రము - (బంకించంద్ర ఛటర్జీ ఆంగ్ల నవల "LAKE OF PALMS")
వాల్మీకి రామాయణం (కృష్ణమూర్తి అయ్యర్ రచన)
రఘుకుల చరిత్ర (కాళిదాసుని రఘువంశం నుంచి)

ఇతర రచనలు
రాజస్థాన కథావళి
మహాపురుషుల జీవిత చరిత్రలు
కృపాంబోనిధి
చిత్రకథాగుచ్ఛ
సమర్థ రామదాసు
భల్లాట శతకం
స్వీయ చరిత్ర
ప్రకాశములు (4 సంపుటములు)
భాగవత కథా మంజరి
రామకృష్ణ పరమహంస చరిత్ర
కాళిదాస చరిత్ర
చంద్రహాసుడు
సిద్ధార్థ చరిత్ర

రచనల నుండి ఉదాహరణలు
బ్రిటిష్ పాలనను నిరసిస్తూ చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన ప్రసిద్ధమైన పద్యం:ఈ పద్యం చెన్నాప్రగడ భానుమూర్తి (1905) రాశాడని కొందరివాదన భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి
గయోపాఖ్యానంలో కృష్ణార్జునుల మధ్య పోరును ఆపడానికి సుభద్ర మగని దగ్గరకూ, అన్న దగ్గరకూ వెళ్ళినపుడు వారు ఆమెను దెప్పిన విధం:
ఎంతయినా ఆడువారికి పుట్టింటి పైనే అభిమానం ఉంటుందంటూ అర్జునుడిలా అన్నాడు
మగువ మీదను పతికింత మక్కువైన
మగువ మీదను పతికింత మమతయున్న
పుట్టినింటికి కడుగూర్చు పొలతి యెపుడు
పుట్టింటి సొమ్ములెన్ని తీసుకొన్నా ఆడువారు మెట్టింటివైపే మాట్లాడుతారంటూ కృష్ణుడు పలికిన విధం
సార చీరెలు నగలును చాలగొనుచు
పుట్టినిండ్ల గుల్లలు జేసిపోయి సతులు
తుదకు మగని పక్షము చేరి ఎదురగుదురు
మగనిపై కూర్మి అధికము మగువకెపుడు
చతుర చంద్రహాసం నాటకంలో - పాండవులను వారణావతానికి పంపమని దుర్యోధనుడు పట్టుబట్టినపుడు ధృతరాష్ట్రుడు పడిన ఆవేదన
కొడుకు నుడువులు వింటినా కులము సెడును
కులము మేలెంచుకొంటినా కొడుకు సెడును
కొడుకు కులమును జెడకుండ నడువ వలయు
లేనిచో వంశమున కెల్ల హాని గల్గు
"పకోడి" గురించి
ఓ సాయంకాలం స్నేహితులంతా కూర్చున్నాక పకోడీలు తెప్పించారు. అక్కడే వున్న చిలకమర్తివారిని వారి స్నేహితులు పద్యాలు చెప్పమని కోరారు. "కవులకు అక్షర లక్షలిచ్చెడి కాలము గతించినది. పద్యమునకు పకోడినిచ్చెడి దుర్దినములు వచ్చినవి" అని హాస్యోక్తులు విసరి ఆయన పకోడిపై చెప్పిన పద్యాలలో కొన్ని:
వనితల పలుకుల యందున
ననిమిష లోకమున నున్న దమృత మటంచున్
జనులనుటె గాని లేదట
కనుగొన నీయందమృతము గలదు పకోడీ!
ఆ కమ్మదనము నారుచి
యా కరకర యా ఘుమఘుమ మా పొంకములా
రాకలు పోకలు వడుపులు
నీకే దగు నెందు లేవు నిజము పకోడీ!
కోడిని దినుటకు సెలవున్
వేడిరి మును బ్రాహ్మణులును వేధ నతండున్
కోడి వలదా బదులుగ ప
కోడిం దినుమనుచు జెప్పె కూర్మి పకోడీ!
"గీత మంజరి" లోని నీతి పద్యం
సరి యయిన మార్గమును బట్టి సంచరించు
నతడు చేరు గమ్యస్థానమశ్రమమున
ఇనుప పట్టీలపై నుండి యేగునట్టి
ధూమ శకటంబు వలె శ్రేణి దొలగకుండ

త్యాగరాజు:

త్యాగరాజు:
త్యాగరాజు (మే 4, 1767 - జనవరి 6, 1847) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి.
జీవిత విశేషాలు
త్యాగరాజు ప్రస్తుత తమిళనాడు లోని తంజావూరు దగ్గరి తిరువయ్యూరు అను గ్రామం (అగ్రహారం) నందు తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. త్యాగరాజు కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. ఇతని జన్మనామం కాకర్ల త్యాగ బ్రహ్మం. ఇతడి పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా, అర్ధవీడు మండలములోని కాకర్ల గ్రామమునుండి తమిళదేశానికి వలస వెళ్లారు. తండ్రి రామబ్రహ్మం తంజావూరు ప్రభువు శరభోజీ ఆదరంలో ఉండేవాడు. 18 సంవత్సరాల వయసులో త్యాగరాజుకు పార్వతి అనే యువతితో వివాహమైంది. కానీ ఆయన 23 వయస్సులో ఉండగా ఆమె మరణించడం జరిగింది. తరువాత ఆయన పార్వతి సోదరియైన కమలాంబను వివాహమాడాడు. వీరికి సీతామహాలక్ష్మి అనే కూతురు కలిగింది. ఈమె ద్వారా త్యాగరాజుకు ఒక మనుమడు కలిగాడు కానీ యవ్వనంలోకి అడుగుపెట్టక మునుపే మరణించాడు. కాబట్టి త్యాగరాజుకు ఖచ్చితమైన వారసులెవరూ లేరు కానీ ఆయన ఏర్పరచిన సాంప్రదాయం మాత్రం ఈనాటికీ కొనసాగుతూనే ఉంది. భమిడిపాటి కామేశ్వర రావు గారు “త్యాగరాజ ఆత్మ విచారము” అనే పుస్తకం రాసారు. ఇందులో పుక్కిట పురాణ కథలు కనిపించవు. తత్వ, అధ్యాత్మిక విశ్లేషణ లతో త్యాగరాజ సంగీతమ్మీదొచ్చిన పుస్తకం ఇదొక్కటే. .ప్రజల మనసులకత్తుకోడం కోసం ఆయన జీవితంలోకి రాముడి లీలలూ, రక్షణలూ చొప్పించి ఆసక్తి కరంగా మలిచారు. రామ భక్తుడిగా పట్టాభిషేకం చేసేసి, చివరకి ఆయన్ని రాముడిలో లీనం చేసేసారు. ఆయన జీవితాన్ని పౌరాణిక గాధగా తీర్చి దిద్దారు.వ్యక్తిగా త్యాగరాజు ఎలా జీవించాడూ? అప్పట్లో ఉన్న యుద్ధాలూ, కల్లోలాలపై ఎలా స్పందించాడూ? ఆయన భార్యా, పిల్లలతో ఎలా గడిపాడూ?, శిష్యులకి ఎలా సంగీత బోధన చేసేవాడూ? ఇలా ఎన్నో వివరాలు ముందు తరాలకి అందకుండా పోయాయి
త్యాగరాజు తన సంగీత శిక్షణను శొంఠి వెంకటరమణయ్య దగ్గర, చాలా చిన్న వయసులోనే ప్రారంభించాడు. పదమూడేండ్ల చిరు ప్రాయమునాడే త్యాగరాజు నమో నమో రాఘవా అనే కీర్తనను దేశికతోడి రాగంలో స్వరపరచాడు. గురువు శొంఠి వేంకటరమణయ్య ఇంటిలో చేసిన కచేరీలో ఎందరో మహానుభావులు అనే కీర్తనను స్వరపరచి పాడాడు. ఇది పంచరత్న కృతులలో ఐదవది. ఈ పాటకు వెంకటరమణయ్య చాలా సంతోషించి, త్యాగరాజులోని బాలమేధావి గురించి తంజావూరు రాజుగారికి చెప్పగా, రాజు సంతోషించి అనేక ధన కనక వస్తు వాహనాది రాజలాంఛనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించాడు. కానీ త్యాగరాజు తనకు నిధి కన్నా రామ సన్నిధి మాత్రమే సుఖమని ఆ కానుకలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. ఈ సందర్భంగా స్వరపరచి పాడినదే నిధి చాల సుఖమా అనే కీర్తన. సంగీతాన్ని భగవంతుని ప్రేమను పొందే మార్గముగా త్యాగరాజు భావించాడు. సంగీతంలోని రాగ, తాళములను వాటిపై తన ప్రావీణ్యాన్ని చూపించుకోవడానికి కాక, భగవంతుని నామాలను చెప్పడానికి, భగవంతుని లీలలను పొగడటానికి ఓ సాధనముగా మాత్రమే చూసాడు.
తంజావూరు రాజు పంపిన కానుకలను తిరస్కరించినపుడు ఆగ్రహించిన అతని అన్నయ్య జపేశుడు, త్యాగరాజు నిత్యం పూజించుకునే శ్రీరామ పట్టాభిషేక విగ్రహాలను కావేరీ నదిలో విసిరివేసాడు. శ్రీరామ వియోగ బాధను తట్టుకోలేక, రాముడు లేని ఊరిలో ఉండలేక దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్ళి అనేకానేక దేవాలయములను, తీర్థములను దర్శించి, ఎన్నో అద్భుత కీర్తనలను త్యాగయ్య రచించాడు. చివరగా శ్రీరాముని అనుగ్రహంతో విగ్రహాలను పొందాడు. వైకుంఠ ఏకాదశి నాడు త్యాగరాజు శ్రీరామ సన్నిధిని చేరుకున్నాడు.
త్యాగరాజు జీవితంలో జరిగినట్లుగా కొన్ని విశేషాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దేవముని అయిన నారదుడే స్వయంగా ఇతనికి సంగీతంలోని రహస్యాలను చెప్పి, ఓ అద్భుతమైన పుస్తకం ఇచ్చాడనీ, ఆ సంధర్భంలో త్యాగరాజు చెప్పిన కృతిగా పంచరత్న కృతులలో మూడవదైన "సాధించెనా" అనీ చెపుతారు.

త్యాగరాజు జీవితంలో కొన్ని సంఘటనలు
త్యాగరాజు తన రామచంద్రుని పూజా విగ్రహాలు పోగొట్టుకున్నప్పుడు పాడిన పాట: ఎందు దాగినావో
ఇతడు తిరుపతి వేంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ తెరవేసి ఉంటే, తెరతీయగరాదా అనే పాట పాడితే తెరలు వేంకటేశ్వరుని దయచేత అవే తొలగిపోయినాయి. ఆ తరువాత ఆయన వేంకటేశ నిను సేవింప అనే పాట పాడినాడు.
త్యాగయ్య పరమపదము చేరటానికి ముందు పాడిన పాటలు: గిరిపై, పరితాపము

త్యాగరాజ ఆరాధనోత్సవాలు
అసంఖ్యాకమైన కీర్తనలు రచించి, కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వతమైన కీర్తి సంపాదించిన త్యాగరాజును కర్ణాటసంగీతానికి మూలస్థంభంగా చెపుతారు. ఈ సంగీత నిధికి నివాళిగా ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు (జనవరి, ఫిబ్రవరి నెలలలో) తిరువయ్యూర్ లో ఆయన సమాధి చెందిన త్యాగరాజ మహోత్సవ సభనందు త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.
ఆయన భక్తులు మరియు సంగీత కళాకారులు మొదట ఉంచవృతి భజన, తరువాత ఆయన నివాస స్థలమైన తిరుమంజనవీధి నుంచి బయలుదేరి ఆయన సమాధి వరకూ కీర్తనలు గానం చేస్తూ ఊరేగింపుగా వస్తారు. వందలకొద్దీ సంగీత కర్ణాటక సంగీత కళాకారులు ఆయన రచించిన పంచరత్న కృతులను కావేరీ నది ఒడ్డున గల ఆయన సమాధి వద్ద బృందగానం చేస్తారు. సంగీతాభిమానులకు ఈ గానం శ్రవణానందాన్ని కలిగించడమే కాకుండా భక్తిభావాన్ని కూడా రేకెత్తిస్తుంది. ఈ ఉత్సవాన్ని ప్రపంచంలో చాలాచోట్ల నిర్వహిస్తారు కానీ తిరువయ్యూరులో నిర్వహించే ఆరాధన చాలా ప్రసిద్ధి గాంచినది. ప్రతీ సంవత్సరం పెరుగుతూ వస్తున్న కళాకారుల మరియు సందర్శకుల కోసం ఇక్కడ ఒక పెద్ద భవనం కూడా నిర్మాణదశలో ఉంది.
సమాధి
త్యాగరాజ స్వామివారి మహాభక్తురాలు బెంగుళూరు నాగరత్నమ్మ కావేరీ నది ఒడ్డున శిధిలావస్థలోనున్న స్వామి వారి సమాధి చూసింది. ఆ స్థలాన్ని, దాని చుట్టు ఉన్న ప్రదేశాన్ని తంజావూరు రాజుల ద్వారా, రెవిన్యూ అధికారుల ద్వారా తన వశము చేసికొని పరిశుభ్రము చేయించి, గుడి, గోడలు కట్టించింది. మదరాసులోని తన ఇంటిని అమ్మి రాత్రనక పగలనక వ్యయప్రయాసల కోర్చి దేవాలయ నిర్మాణాన్ని ముగించింది. అక్టోబర్ 27, 1921లో పునాదిరాయిని నాటగా, జనవరి 7, 1925న గుడి కుంభాభిషేకము జరిగింది. స్థలాభావము వలన ఇంకా నేల కొని ఒక మంటపము, పాకశాల 1938లో నిర్మించింది. ఈ నిర్మాణములతో ఆమె సంపద, ఆభరణాలు హరించుకుపోయాయి. 1946లో త్యాగయ్య చిత్ర నిర్మాణసందర్భములో చిత్తూరు నాగయ్య గారు నాగరత్నమ్మను కలిశారు. ఆమె సలహాపై నాగయ్య గారు త్యాగరాజనిలయం అనే సత్రాన్ని కట్టించారు.
కీర్తనలు
త్యాగయ్య దాదాపు 800 కీర్తనలను రచించాడు.వీటిలో చాలావరకు ఆయన మాతృభాష ఐనటువంటి తెలుగులో రచించినవే. కొన్ని సంస్కృతంలో రచించబడినవి. కానీ ఈ కీర్తనలు మాత్రం ఆంధ్రదేశంలోకన్న కర్ణాటక సంగీతం బాగా ప్రాచుర్యంలో ఉన్న తమిళనాట బాగా ప్రాచుర్యం పొందాయి. సంస్కృతంలో రచించబడిన జగదానందకారక అనే కీర్తన శ్రీరామునికున్న 108 పేర్లను ప్రస్తావిస్తుంది. 'ప్రహ్లాద భక్తి విజయం' అనే రూపకాన్ని కూడా రచించాడు. త్యాగరాజు కీర్తనల పూర్తి పట్టిక కోసం త్యాగరాజు కీర్తనలు అనే వ్యాసాన్ని చూడండి.

జంధ్యాల పాపయ్య శాస్త్రి:

జంధ్యాల పాపయ్య శాస్త్రి:
జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. వీరి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో విన సొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి, "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు.
పుష్పవిలాపము మరియు కుంతీకుమారి వంటి కవితలు ఘంటసాల గారి రికార్డుల ద్వారా బాగా ప్రాచుర్యము పొందాయి.
పుష్పవిలాపము లోని కొన్ని పద్యములు:
సీనే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గోరానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మాప్రాణము తీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నామానసమం దెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై ఊలు దారాలతో గొంతు కురి బిగించిగుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చిముడుచు_కొందురు ముచ్చట ముడుల మమ్ముఅకట! దయలేని వారు మీ యాడువారు"కుంతీకుమారి" నుండిమముని మంత్రమ్ము నొసంగనేల? ఇడెబో మున్ముందు మార్తాండు రమ్మని నే కోరగనేల? కోరితిని బో యాతండు రానేల? వచ్చెను బో కన్నియనంచు నెంచక ననున్ జేపట్టగా నేల? పట్టెను బో పట్టి నొసంగనేల? యడుగంటెన్ కుంతి సౌభాగ్యముల్బాష్పముల సాము తడిసిన ప్రక్క మీద చిట్టిబాబును బజ్జుండ బెట్టె తల్లి. భోగ భాగ్యాలతో తులదూగుచున్నకుంతి భోజుని గారాబు కూతురు నయికన్న నలుసుకు ఒక పట్టె డన్నమైనపెట్టుకో నోచనైతి పాపిష్ఠిదాన.""అంజలి" నుండి సీపుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమైపొదుగు గిన్నెల పాలు పోసి పోసికలికి వెన్నెలలూరు చలువ దోసిళ్ళతోలతలకు మారాకు లతికి యతికిపూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధ పరచి పరచితెల వారకుండ మొగ్గలలోనజొరబడివింత వింతల రంగు వేసి వేసి తీరికే లేని విశ్వ సంసారమందుఅలసి పోయితివేమొ దేవాదిదేవఒక నిమేషమ్ము కన్ను మూయుదువు గానిరమ్ము! తెరచితి మా కుటీరమ్ము తలుపు సీలోకాల చీకట్లు పోకార్ప రవిచంద్రదీపాలు గగనాన త్రిప్పలేకజగతిపై బడవచ్చు జలరాశి కెరటాలుమామూలు మేరకు మడవలేకపని మాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండెగడియారముల కీలు కదపలేకఅందాలు చింద నీలాకాశ వేదిపైచుక్కల మ్రుగ్గులు చెక్కలేకఎంత శ్రమ నొందుచుంటివో యేమొ స్వామి!అడుగిడితి వెట్లొ నేడు మా గడపలోన;గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతుఅందుకోవయ్య హృదయ పుష్పాంజలులనుసీకూర్చుండ మా యింట కురిచీలు లేవునా ప్రణయాంకమే సిద్ధ పరచనుంటిపాద్యమ్ము నిడ మాకు పన్నీరు లేదునా కన్నీళ్ళతో కాళ్ళు కడుగనుంటిపూజకై మా వీట పుష్పాలు లేవు నాప్రేమాంజలులె సమర్పింప నుంటినైవేద్య మిడ మాకు నారికేళము లేదుహృదయమే చేతి కందీయనుంటి లోటు రానీయ నున్నంతలోన నీకురమ్ము! దయసేయు మాత్మ పీఠమ్ము పైకిఅమృత ఝురి చిందు నీ పదాంకముల యందుకోటి స్వర్గాలు మొలపించుకొనుచు తండ్రి!

జాషువా:

జాషువా:
ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా (Gurram Jashuva). సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు.
జీవిత విశేషాలు
జాషువా 1895 సెప్టెంబర్ 28 న వీరయ్య, లింగమ్మ దంపతులకు ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండ లో జన్మించాడు. తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు. ఈ ఒక్క విషయం చాలు, మూఢాచారాలతో నిండిన సమాజంలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కోడానికి. బాల్యం వినుకొండ గ్రామంలో పచ్చని పొలాల మధ్య హాయిగానే సాగింది. చదువుకోడానికి బడిలో చేరిన తరువాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు.
అయితే జాషువా ఊరుకొనేవాడు కాదు, తిరగబడేవాడు. అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే, తిరగబడి వాళ్ళను కొట్టాడు. 1910లో మేరీని పెళ్ళి చేసుకున్నాడు. మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతంపై ఉద్యోగం చేసేవాడు. ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్ళి 1915-16 లలో అక్కడ సినిమా వాచకుడిగా పనిచేసాడు. టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణలను చదువుతూ పోవడమే ఈ పని. తరువాత గుంటూరులోని లూథరన్‌ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా 10 సంవత్సరాల పాటు పని చేసాడు. తరువాత 1928 నుండి 1942 వరకు గుంటూరు లోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేసాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేసాడు. 1957-59 మధ్య కాలంలో మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేసాడు.
ఒకసారి వినుకొండలో జరిగిన ఒక అవధాన సభలో ఆయన పద్యాలు చదివాడు. తక్కువ కులం వాడిని సభ లోకి ఎందుకు రానిచ్చారంటూ కొందరు ఆయనను అవమానించారు. ఆయనకు జరిగిన అవమానాలకు ఇది ఒక మచ్చు మాత్రమే. అంటరాని వాడని హిందువులు ఈసడిస్తే, క్రైస్తవుడై ఉండీ, హిందూ మత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు ఆయన్ను నిరసించారు. ఆయన కుటుంబాన్ని క్రైస్తవ సమాజం నుండి బహిష్కరించారు. క్రమంగా ఆయన నాస్తికత్వం వైపు జరిగాడు.
జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువాకు 1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి లో సభ్యత్వం లభించింది.
1971 జూలై 24న గుంటూరులో గుర్రం జాషువా మరణించాడు.

సాహితీ వ్యవసాయం
చిన్నతనం నుండీ జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేది. బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవాడు. బాల్య స్నేహితుడూ, తరువాతి కాలంలో రచయితా అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సాహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. జూపూడి హనుమచ్ఛాస్త్రి వద్ద మేఘసందేశం,రఘువంశం, కుమార సంభవం నేర్చుకున్నాడు. జాషువా 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రాసాడు. వాటిలో ప్రముఖమైనవి:
గబ్బిలం
బాపూజీ
క్రొత్తలోకము
ముంతాజు మహలు
ఫిరదౌసి
నా కథ
కాందిశీకుడు
ఆంధ్ర మాత
గబ్బిలం (1941) ఆయన రచనల్లో సర్వోత్తమమైనది. కాళిదాసు మేఘసందేశం తరహాలో సాగుతుంది. అయితే ఇందులో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. ఎందుకంటే గుడిలోకి దళితునకు ప్రవేశం లేదు కాని గబ్బిలానికి అడ్డు లేదు. కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది.
1932లో వచ్చిన ఫిరదౌసి మరొక ప్రధాన రచన. పర్షియన్ చక్రవర్తి ఘజనీ మొహమ్మద్ ఆస్థానంలో ఉన్న కవి ఫిరదౌసి. అతనికి రాజుగారు మాటకొక బంగారు నాణెం ఇస్తానని చెప్పగా ఆ కవి పది సంవత్సరాలు శ్రమించి మహాకావ్యాన్ని వ్రాశాడు. చివరకు అసూయాపరుల మాటలు విని రాజు తన మాట తప్పాడు. ఆవేదనతో ఆత్మహత్య చేసుకొన్న ఆ కవి హృదయాన్ని జాషువా అద్భుతంగా వర్ణించాడు.
1948 లో రాసిన బాపూజీ - మహాత్మా గాంధీ మరణ వార్త విని ఆవేదనతో జాషువా సృష్టించిన స్మృత్యంజలి.
సంవత్సరాల వారీగా జాషువా రచనల జాబితా
1919 - రుక్మిణీ కళ్యాణం
1922 - చిదానంద ప్రభాతం, కుశలవోపాఖ్యానం
1924 - కోకిల
1925 - ధ్రువ విజయం, కృష్ణనాడి, సంసార సాగరం
1926 - శివాజీ ప్రబంధం, వీరాబాయి, కృష్ణదేవరాయలు, వేమన యోగీంద్రుడు, భారతమాత
1927 - భారత వీరుడు, సూర్యోదయం, చంద్రోదయం, గిజిగాడు
1928 - రణచ్యుతి, ఆంధ్రుడను, తుమ్మెద పెండ్లికొడుకు
1929 - సఖి, బుద్ధుడు, తెలుగు తల్లి, శిశువు, బాష్ప సందేశం
1930 - దీర్ఘ నిశ్వాసము, ప్రబోధము, శిల్పి, హెచ్చరిక, సాలీడు, మాతృప్రేమ
1931 - భీష్ముడు, యుగంధర మంత్రి, సమదృష్టి, నేల బాలుడు, నెమలి నెలత, లోక బాంధవుడు, అనసూయ, శల్య సారథ్యము, సందేహ డోల
1932 - స్వప్న కథ, అనాధ, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, సింధూరము, బుద్ధ మహిమ, క్రీస్తు, గుంటూరు సీమ, వివేకానంద, చీట్లపేక, జేబున్నీసా, పశ్చాత్తాపం.
1933 - అయోమయము, అఖండ గౌతమి, ఆశ్వాసము, మేఘుడు, స్మశానవాటిక,
1934 - ఆంధ్ర భోజుడు
1941 - గబ్బిలము
1945 - కాందిశీకుడు
1946 - తెరచాటు
1948 - చిన్న నాయకుడు, బాపూజీ, నేతాజీ
1950 - స్వయంవరం
1957 - కొత్తలోకం
1958 - క్రీస్తు చరిత్ర
1963 - రాష్ట్ర పూజ, ముసాఫిరులు
1966 - నాగార్జునసాగరం, నా కథ

అవార్డులు
1964లో క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా నియమితుడయ్యాడు.
1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.
1970లో భారత ప్రభుత్వము పద్మభూషణ పురస్కారం అందజేసింది.
జాషువా కూతురు హేమలతా లవణం, జాషువా స్మారకార్ధం జాషువా సాహిత్య పురస్కారం నెలకొల్పినది. ఈ అవార్డును ప్రతియేటా వివిధ భారతీయ భాషలలోని అత్యుత్తమ కవులకు ప్రదానం చేస్తారు.

చెణుకులు
ఒకసారి జాషువాకు, మరో ప్రముఖ కవికి కలిపి ఒక సాహిత్య బహుమతి ఇవ్వడం జరిగింది. జాషువా అంటే అంతగా పడని ఆ కవి "గుర్రాన్నీ గాడిదనీ ఒకే గాట కట్టేశారు" అని అన్నాడు. అప్పుడు గుర్రం జాషువా "నిజమే, ఈ ఒక్కసారికి మాత్రం ఆయనతో ఏకీభవించకుండా ఉండలేకపోతున్నాను" అని అన్నాడు.
ఈ పద్యంలో కవిలోకానికి జాషువా సనముచిత స్థానం కల్పించేరు.
"రాజు మరణించెనొక తార రాలిపోయె సుకవి మరణిమంచెనొక తార గగనమెక్కె రాజు జీవించు రాతివిగ్రహములయందు సుకవి జీవించు ప్రజల నాల్కలయందు"

బిరుదులూ, పురస్కారాలూ
జాషువా తన జీవితకాలంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి ఆయన కాలికి గండపెండేరం తొడిగి ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను అన్నాడు. అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా భావించాడు.
ఎన్నో బిరుదులు, సత్కారాలు అందుకున్నాడాయన. కవితా విశారద,కవికోకిల, కవి దిగ్గజ - నవయుగ కవిచక్రవర్తి,మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ గా ప్రసిద్ధుడయ్యాడు. పద్మభూషణ, ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కళాప్రపూర్ణ, మొదలైన పురస్కారాలు అందుకున్నాడు.

ఆరుద్ర:

ఆరుద్ర:
తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన ' త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మికూడా ప్రముఖ తెలుగు రచయిత్రి.

తొలి జీవితం
ప్రముఖ చిత్రకారుడు బాపు గీసిన ఆరుద్ర రేఖా చిత్రం
ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలో జన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ హైస్కూల్ లో , తర్వాత విజయనగరంలో యం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. 1947-48 లో చెనై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి ' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వ్యవస్థాపకుల్లో ఒకడైన ఆరుద్ర ఆ సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. ఆరుద్ర మహాకవి శ్రీశ్రీకి వేలువిడిచిన మేనల్లుడు. ప్రముఖ రచయిత చాగంటి సోమయాజులు (చాసో) మార్కిస్టు భావాలను నూరిపోశాడని, ఆరుద్ర కవితాధోరణిలో శ్రీశ్రీ ప్రభావం కొంతవరకూ ఉందని సాహితీ విమర్శకులు అంటారు.

సాహిత్య సేవ
1946 లో చెన్నై వచ్చిన ఆరుద్ర కొంతకాలం పాటు చాలా కష్టాలు అనుభవించాడు. తినడానికి తిండిలేక పానగల్ పార్కులొ నీళ్ళు త్రాగి కడుపు నింపుకోవల్సి వచ్చిన సందర్భాలున్నాయని ఆరుద్ర చెప్పుకున్నాడు. అయితే ఈ ఇక్కట్లు ఏవీ సాహిత్య సేవకు అడ్డం రాలేదని ఆయన అన్నాడు. నెలకొకటి చొప్పున వ్రాస్తానని ప్రతిజ్ఞ చేసి డిటెక్టివ్ నవలలనుంచి మళ్ళీ అదే ప్రతిజ్ఞతో సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాలవరకు ఆరుద్ర " దోహదం" తో పల్లవించని సాహితీ శాఖలేదు. త్వమేవాహంతో మొదలుపెట్టి వందలాదిగా గేయాలు , గేయ నాటికలు , కథలు, నవలలు, సాహిత్య పరిశోధక వ్యాసాలు, వ్యంగ వ్యాసాలు, పుస్తకాలకు పీఠికలు, పుస్తకాలపై విమర్శలు ఇవన్నీ కాక తన అసలు వృత్తి సినీ గీత రచన..... ఇంత వైవిధ్యంగల సాహిత్యోత్పత్తి చేసిన ఆధునికుడు మరొకడు కనబడడు.
తెలుగు సాహిత్య ప్రపంచానికి ప్రాపంచిక దృష్టితోపాటు భౌతిక దృక్పథాన్ని పరిచయం చేసిన సాహితీ ఉద్యమం అభ్యుదయ సాహిత్యం . అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు. వివిధ రంగాల్లోనే కాక వివిధ ప్రక్రియల్లో ఆరితేరిన అరుదైన వ్యక్తి ఆరుద్ర. త్వమేవాహం , సినీవాలి , కూనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు వంటి అనేక కావ్యాలతో పాటు వెన్నెల- వేసవి , దక్షిణవేదం, జైలుగీతాలు వంటి అనువాద రచనలు రాదారి బంగళా, శ్రీకృష్ణదేవరాయ , కాటమరాజు కథ వంటి అనేక రూపకాలుతో పాటు కొన్నికథలనూ, నవలలనూ కూడా రచించాడు. సమగ్ర ఆంధ్ర సాహిత్యం ( 14 సంపుటాలు) ఆరుద్ర పరిశోధనాదృష్టికి పరాకాష్ట. దీనికోసం మేధస్సునే కాకుండా , ఆరోగ్యాన్ని కూడా ఖర్చుపెట్టాడు. వేమన వేదం , మన వేమన, వ్యాస పీఠం, గురజాడ గురుపీఠం, ప్రజాకళలో ప్రగతివాదులు వంటివి ఆరుద్ర సాహిత్య విమర్శనా గ్రంథాలు. రాముడికి సీత ఏమౌతుంది?,గుడిలో సెక్స్ వంటి రచనలు ఆరుద్ర పరిశీలనా దృష్టికి అద్దంపడతాయి. సంగీతం పైనా, నాట్యం మీద రచించిన అనేక వ్యాసాలు ఇతర కళల్లో ఆరుద్ర అభినివేశాన్ని పట్టి చూపిస్తాయి. చదరంగం పైనకొన్ని దశాబ్ధాలకు పూర్వమే ఒక గ్రంథాన్ని ప్రకటించడం ఆరుద్రలోని మరో ప్రత్యేకత. ఇలా పలు రచనా ప్రక్రియలలో చేపట్టి, కవిత్వం- పరిశోధనా రెంటినీ వినియోగిస్తూ కవి పరిశోధకుడిగా నవ్యత కోసం పరితపించిన నిత్య శోధకుడు హేతువాది ఆరుద్ర.

రచనలు
కవిత్వం
త్వమేవాహం - 1948. ఇది ముఖ్యమైన తెలుగు రచనలలో ఒకటి. తెలంగాణా నిజా పాలనలలో జరిగిన రజాకార్ల అకృత్యమాలు ఈ రచన నేపధ్యం. మృత్యువు ఒక వ్యక్తితో నువ్వే నేను (త్వమేవాహం) అంటుంది. ఒకచోట రచయిత సమాజంలోని ఘటనలను, దృక్పధాలను ఊహాజనితమైన గడియారంతో పోలుస్తాడు.
సినీవాలి
గాయాలు-గేయాలు
కూనలమ్మ పదాలు
ఇంటింటి పద్యాలు
పైలా పచ్చీసు
ఎంచిన పద్యాలు
ఏటికేడాది
శుద్ధ మధ్యాక్కరలు.
జంట కవిత్వం
శ్రీశ్రీతో కలసి రుక్కుటేశ్వర శతకం,
శ్రీశ్రీ వరదలతో కలసి సాహిత్యోపనిషత్,
మేమే.
పరిశోధన, విమర్శలు, వ్యాసాలు
సమగ్ర ఆంధ్ర సాహిత్యం - ఇది తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసేవారికి ఒక గొప్ప ఉపయుక్త గ్రంధం. ఇలాంటి రచన చేయడం అకాడమీలు, ప్రభుత్వ సంస్థలు వంటి వనరులు గలిగిన సంస్థలు మాత్రమే పూనుకొనగల పని. అటువంటి మహాకార్యాన్ని ఆరుద్ర ఒక్కడే తలకెత్తుకొని విజయవంతంగా పూర్తి చేశాడు. ఇది 1965, 1968లలో 12 సంపుటాలుగా వెలువడింది. ఇందులో తెలుగు సాహిత్యాన్ని ఆరుద్ర విభజించిన విధం ఇలా ఉంది.
పూర్వ యుగము, చాళుక్య చోళ కాలము - (800-1200)
కాకతీయుల కాలము (1200-1290)
పద్మనాయకుల కాలము (1337-1399)
రెడ్డిరాజుల కాలము (1400 - 1450)
రాయల ప్రాంభ కాలము (1450 - 1500)
రాయల అనంతర కాలము (1500 - 1550)
నవాబుల కాలము (1550 - 1600)
నాయకుల కాలము (1600 - 1670)
అనంతర నాయకుల కాలము (1670 - 1750)
కంపెనీ కాలము (1750-1850)
జమీందారుల కాలము (1850 - 1900)
ఆధునిక కాలము (1900 తరువాత)
రాముడికి సీత ఏమౌతుంది,
అరుద్ర వ్యాసపీఠం,
వేమన్న వాదం.
అనువాదాలు
వీర తెలంగాణా విప్లవగీతాలు (ఇంగ్లీషు నుంచి)
వెన్నెల- వేసవి ( తమిళం నుంచి)
కబీరు భావాలు - బట్వాడా ఆరుద్ర ( హిందీ నుంచి)
నాటికలు
ఉద్గీత
రాదారి బంగళా
సాల భంజికలు,
సినిమా పాటలు
1949లో బీదల పాట్లు అన్న చిత్రంలో .. " ఓ చిలుకరాజా నీ పెళ్లెప్పుడు ' అనే గీతంతో మొదలుపెట్టి దాదాపు నాలుగువేల సినిమా పాటలు వ్రాసాడు.
పెంకి పెళ్లాం చిత్రంలో - " పదచుదనం రైలుబండి పోతున్నది " ,
ఉయ్యాల జంపాల చిత్రంలో - " కొండగాలి తిరిగింది " , ఇదే చిత్రంలో " అందాల రాముడు ఇందీవర శ్యాముడు".
మీనా చిత్రంలో - " శ్రీరామ నామాలు శతకోటి" .
బందిపోటు చిత్రంలో " ఊహలు గుసగుసలాడే "
బాలరాజు కథ లో " మహాబలిపురం మహాబలిపురం "
ఆంధ్ర కేసరి చిత్రంలో " వేదంలా ప్రవహించే గోదావరి "
అత్తా ఒకింటి కోడలే " జోడుగుళ్ల పిస్తోలు ఠా "
యం.ఎల్.ఏ. చిత్రంలో " ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం మరియు " నీ ఆశ అడియాశ "
అందాల రాముడు చిత్రంలో " ఎదగడానికికెందుకురా తొందర "
గోరంత దీపం చిత్రంలో " రాయినైనా కాకపోతిని "
ముత్యాల ముగ్గు చిత్రంలో " ఏదో ఏదో అన్నది మసక వెలుతురు " మరియు ముత్యమంత పసుపు ముఖమెంతో చాయ
బాల భారతం చిత్రంలో " మానవుడే మహనీయుడు "
ఇద్దరు మిత్రులు చిత్రంలో - " హలో హలో అమ్మాయి "
ఆత్మ గౌరవం చిత్రంలో " రానని రాలేనని ఊరకె అంటావు. "
ఆత్మీయులు చిత్రంలో " స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు "
మొదలగు సినిమా పాటలు వ్రాసి పాటకు ఒక అర్థాన్ని పరమార్థాన్ని ప్రసాదించి ప్రతిపాటలో తన ముద్రను కనిపింపచేశాడు.
పురస్కారాలు
ఇతనికి 1985లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్) ప్రదానం చేసింది.

విశ్వనాథ సత్యనారాయణ:

విశ్వనాథ సత్యనారాయణ:
విశ్వనాథ సత్యనారాయణ (1895-1976) "కవి సమ్రాట్" బిరుదాంకితుడు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.- కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింప బడినవాని సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ఆయన రాసిన రచనలన్నీ కలిపితే లక్షపుటలుండవచ్చును .విశ్వనాధ మాట్లాడే వెన్నెముక అని శ్రీశ్రీ వర్ణించాడు. జి.వి. సుబ్రహ్మణ్యం ఇలా చెప్పాడు - "ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాధ ఒక విరాణ్మూర్తి. వచన కవిత్వం వినా ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు. గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాధ కృతిలో ఆయనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనంలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్ష్యం వెల్లివిరుస్తుంది. మహఅకవిగా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం ఈ వ్యక్తిత్వం."

జీవిత విశేషాలు
విశ్వనాథ సత్యనారాయణ 1895, సెప్టెంబరు 10న (మన్మథ నామ సంవత్సర భాద్రపద బహుళ షష్ఠి)) కృష్ణా జిల్లా నందమూరు గ్రామం (నేటి ఉంగుటూరు మండలం)లో జన్మించాడు. తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతమ్మ. ఈయన భార్య వరలక్ష్మమ్మ. విద్యాభ్యాసము నందమూరు, ఇందుపల్లి, మరియు పెదపాడు గ్రామాల్లోను, పై చదువులు బందరు పట్టణంలోను సాగాయి. బందరు హైస్కూలులో చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తెలుగు ఉపాధ్యాయునిగా లభించడం ఆయన అదృష్టం. బి.ఎ. తరువాత విశ్వనాథ సత్యనారాయణ బందరు హైస్కూలులోనే ఉపాధ్యాయునిగా చేరాడు. ఉద్యోగం చేస్తూనే మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎమ్.ఎ. పట్టా సాధించాడు. తరువాత మహాత్మా గాంధీ నడపుతున్న సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం కోసం ఉద్యోగాన్ని వదులుకున్నాడు.
తరువాతి కాలంలో ఈయన వివిధ కళాశాలల్లో అధ్యాపక పదవులు నిర్వహించాడు. బందరు నేషనల్ కాలేజి (1928), గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజి (ఏసీ కాలేజీ) (1938 వరకు), విజయవాడలో ఎస్.ఆర్.ఆర్.&‍ సి.వి.ఆర్. కాలేజి (1938-1959)(ఈ కళాశాల ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ కళాశాల గా మార్పు చెందింది), కరీంనగర్ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కాలేజి (1959) మొదలైన కళాశాలల్లో ఆయన పని చేసాడు. 1957లో విశ్వనాథ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షుడుగానూ, 1958లో విధానమండలికి నామినేటెడ్ సభ్యుడుగానూ విధులు నిర్వర్తించాడు.
1976 అక్టోబరు 18న (నల నామ సంవత్సర ఆశ్వయుజ బహుళ దశమి) విశ్వనాథ పరమపదించాడు. విశ్వనాధ జీవితంలో చాలా కాలం విజయవాడ నగరంలోనే గడచింది. విశ్వనాధ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని విజయవాడలో ఆయన విగ్రహాన్ని ఆప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఆవిష్కరించాడు.

సాహితీ ప్రస్థానం
1961 లో కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాలుగా పదవీ విరమణ చేసిన తరువాత పూర్తి స్థాయిలో తన సమయాన్ని సాహితీ వ్యాసాంగానికి కేటాయించాడు. 1916 లో "విశ్వేశ్వర శతకము" తో విశ్వనాథ రచనా ప్రస్థానము ప్రారంభమైనది. అప్పటి జాతీయోద్యమ ప్రభావంతో ఆసమయంలోనే "ఆంధ్రపౌరుషము" రచించాడు. 1920నాటికే తెలుగులో ప్రసిద్ధ కవిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.
తరువాత విశ్వనాథ రచనా పరంపర పుంఖానుపుంఖాలుగా కొనసాగింది. మొత్తానికి 25 పైచిలుకు కావ్యాలు, 6 శతకాలు, 13 గేయకావ్యాలు, 15 నాటకాలు, 88 నవలలు, 10 సంస్కృత నాటకాలు, 10 విమర్శనా గ్రంధాలు, మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు - ఇలా తెలుగుభాషకు విశ్వనాథ వందల్లో రచనలందించాడు. ఆయన రచనలను కొన్ని ఇతర భాషలలోకి అనువదించారు. రేడియో కోసం నాటకాలు, ప్రసంగాలు రూపొందించాడు.
ప్రముఖ బెంగాలీకవి రవీంద్రనాధ టాగూరు వలె తన రచయితలను కొన్నైనా ఆంగ్లంలోకి తర్జుమా చేసుకొంటే ఆయన అంతర్జాతీయ ఖ్యాతినర్జించి ఉండేవాడని ఆయన అభిమానులు అంటుంటారు. అయితే విశ్వనాధ రచనలను విశ్లేషించే విమర్శకుడు ఆయన తాత్విక స్థాయిని అర్ధం చేసుకొంటే గాని సాధ్యం కాని విషయం
పాత్ర చిత్రణ
విన్నూత్న, విశిష్టమైన పాత్ర చిత్రణకు విశ్వనాధ పెట్టింది పేరు. ఆయా సందర్భాన్నిబట్టి, సన్నివేశాన్ని బట్టి పాత్రల మనస్త్వత్తాన్ని విశ్లేషించుకుంటూ స్వయం వక్తిత్వంగల పాత్రలుగానూ, స్వయం ప్రకాశవంతమయిన పాత్రలుగానూ, మహత్తరమయిన, రమణీయమయిన శిల్పాలుగాను తీర్చి దిద్దారు. అందునా వారి స్త్రీ పాత్ర చిత్రణ అద్భుతం!
ముఖ్య రచనలు
విశ్వనాథ రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి - ఆంధ్రపౌరుషము, రామాయణ కల్పవృక్షము, వేయిపడగలు, కిన్నెరసాని పాటలు, పురాణవైర గ్రంథమాల, కాశ్మీర చారిత్రిక నవలలు, విశ్వనాథ మధ్యాక్కఱలు, నన్నయ ప్రసన్నకథాకలితార్థయుక్తి వంటివి. తెలుగు తనమన్నా, తెలుగు భాషన్నా విశ్వనాధకు ప్రత్యేక అభిమానం. ఆంధ్ర పౌరుషం, ఆంధ్రప్రశస్తి ఆయన మొదటి రచనలలోనివి. విశ్వనాధ రచనలలో అతని పాండిత్యమే కాక, రచనాశిల్పం, పాత్ర చిత్రణ, చారిత్రిక అవగాహన అద్భుతంగా కనిపిస్తుంటాయి.
తన రచనలలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం (జ్ఞానపీఠ అవార్డు లభించినది) తనకు వ్యక్తిగతంగా ఎంతో తృప్తినిచ్చిందని చెప్పాడు. ఎందరో కవులు వ్రాసినా మళ్ళీ ఎందుకు వ్రాయాలంటే రోజూ తింటున్నామని అన్నం తినడం మానివేయడంలేదుగదా అన్నాడు. తమిళనాడులోని మధురై ప్రాంతం నేపధ్యంలో వచ్చిన నవల "ఏకవీర"ను పుట్టపర్తి నారాయణాచార్యులు మళయాళంలోనికి, అంబటిపూటి హనుమయ్య తమిళంలోనికి అనువదించారు. ఏకవీర సినిమా కూడా వచ్చింది. ఆ సినిమాకు సి.నారాయణరెడ్డి మాటలు, పాటలు సమకూర్చాడు. వేయిపడగలు నవలను మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు "సహస్రఫణ్" పేరుతో హిందీ లోకి అనువదించాడు. భారతీయ సంస్కృతి, ఆచారం, విశేషాలు, మధ్య తరగతి జీవన విధానాలు ఈ నవలలో విశేషంగా చూపబడ్డాయి. కోకిలమ్మ పెళ్ళి, కిన్నెరసాని పాటలు (ఆనాటి) యువతరాన్ని ఆకట్టుకొనే వ్యావహారిక భాషలో వ్రాశాడు. విశ్వనాధ నవలలలో పురాణవైర గ్రంధమాల క్రింద వచ్చిన 12 నవలలు మహాభారతానంతర పూర్వయుగ భారతదేశ చరిత్రను మరొకవిధంగా చూపుతాయి. అయితే వీటిలో ప్రతి నవలా ఉత్సుకతో నిండిన కధ, అనితరమైన ఆయన శైలి, విశేషమైన పాత్రలతో పాఠకులను ఆకట్టుకొంటాయి.

వ్యక్తిత్వం
ప్రముఖ చిత్రకారుడు గీసిన విశ్వనాథ సత్యనారాయణ రేఖా చిత్రం
విశ్వనాధ వ్యక్తిత్వం కూడా ప్రాచీన విధానాలకు, ఆచారాలకు కట్టుబడ్డది. భారతీయత మీద, తెలుగుదనంమీద అభిమానం కలిగింది. తన అభిప్రాయాలను, ఇష్టాయిష్టాలను నిక్కచ్చిగా తెలిపేవాడు. ఇందువల్ల విశ్వనాధను వ్యతిరేకించినవారు చాలామంది ఉన్నారు. ఛాందసుడు అనీ, "గతకాలమె మేలు వచ్చుకాలము కంటెన్" అనేవాడు అనీ (శ్రీశ్రీ విమర్శ) విమర్శించారు. విశ్వనాధకు పాశ్చాత్య సాహిత్యం అంటే పడదని అనుకొంటారు. కాని ఆయన పాశ్చాత్య సాహిత్యం పట్ల గౌరవం కలిగి ఉండేవాడు. షేక్స్‌పియర్, మిల్టన్, షెల్లీ వంటి కవుల రచనలను ఆసాంతం పరిశీలించాడు.
గురువులపట్ల ఎనలేని గౌరవం ఉన్న విశ్వనాధకు తన ప్రతిభ గురించ అపారమైన విశ్వాసం కూడా కలిగి ఉండేవాడు. తనంతటివాడు (అనగా విశ్వనాధ సత్యనారాయణ అంతటివాడు) శిష్యుడయ్యాడని చెప్పుకొనే భాగ్యం నన్నయ తిక్కనాదులకు లభించలేదని, చెళ్ళపిళ్ళవారికి దక్కిందని ఒకమారు తమ గురువుగారి సన్మాన సభలో అన్నాడు విశ్వనాధ.
అలనన్నయకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుం
డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో
హల బ్రహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి దావ్యోమ పే
శల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్
జాతీయ భావం తీవ్రంగా ఉండడానికి ఆరోగ్యకరంగా ఉండే ప్రాంతీయ భావం కూడా ఎంతో కొంత అవసరం అని విశ్వనాధ అనేవాడు. శిల్పం గాని, సాహిత్యం గాని జాతీయమై ఉండాలి కాని విజాతీయమై ఉండరాదనేవాడు. సముద్రంపై పక్షి ఎంత ఎగిరినా రాత్రికి గూటికెలా చేరుతుందో అలాగే మన జాతీయత, సంప్రదాయాలను కాపాడుకోవాలనుకొనేవాడు.
విశ్వనాధ వ్యక్తిత్వాన్ని చతుర్వేదుల లక్ష్మీనరసింహం ఇలా ప్రశంసించాడు: - "ఆహారపుష్టి గల మనిషి. ఉప్పూ కారం, ప్రత్యేకంగా పాలు ఎక్కువ ఇష్టం. కాఫీలో గాని తాంబూలంలోగాని ఎక్కువగా పంచదార వాడేవారు. ఆజానుబాహువు. బ్రహ్మతేజస్సు ముఖాన, సరస్వతీ సంపద వాక్కున, హృదయ స్థానాన లక్ష్మీకటాక్ష చిహ్నంగా బంగారుతో మలచిన తులసీమాల. మనస్సు నవ్య నవనీతం. వాక్కు దారుణాఖఁడల శస్త్రతుల్యం. చదివేవి ఎక్కువ ఆంగ్ల గ్రంధాలు. వ్రాసేవి ఆంధ్ర సంస్కృత గ్రంధాలు. చిన్నలలో చిన్న, పెద్దలలో పెద్దగా వదిగి పోయే స్వభావం. శారీరికంగా వ్యాయామం, యోగాభ్యాసం అయన నిత్యం అభ్యసించేవి. విమర్శలూ, స్తోత్రాలూ, తిట్లూ, దీవెనలూ, దారిద్ర్యం, ఐశ్వర్యం - ఇలాంటి ద్వంద్వాలకు అతీతుడు. ఒకమాటలో ఆయన అపూర్వమైన 'దినుసు'"
పురస్కారాలు
విశ్వనాధకు గుడివాడలో జరిగిన గజారోహణ సన్మానం
ఆంధ్రజాతి తన సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయనను "కవి సామ్రాట్" బిరుదుతో సత్కరించింది.
1964లో ఆంధ్రా యూనివర్సిటీ "కళాప్రపూర్ణ" తో సన్మానించింది.
1942 సంక్రాంతికి ఆయనకు గుడివాడలో "గజారోహణం" సన్మానం జరిగింది. 1956 లో షష్టి పూర్తి వేడుకలు కూడా గుడివాడలో ఘనంగా జరిగాయి.
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం డి.లిట్ పట్టాతో సన్మానించింది.
"విశ్వనాథ మధ్యాక్కఱలు" రచనకు కేంద్రసాహిత్య అకాడెమీ వారి బహుమతి లభించింది.
1970లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవిగా గౌరవించింది.
1970లో భారత ప్రభుత్వము పద్మభూషణ పురస్కారం తో గౌరవించింది.
జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత. 1971లో ఆయన "రామాయణ కల్పవృక్షము"నకు, జ్ఞానపీఠ పురస్కారాన్ని అందించినపుడు, సన్మాన పత్రంలో ఇలా వ్రాయబడింది
As a Poet of classic vision and virility, as a novelist and play wright of deep insight and impact, as an essayist and literary critic of force and felicity, and as a stylist of rare "range" Mr. Satyanarayana has carved for himself a place of eminence amongst the immortals of Telugu Literature. His ceaseless creativity and versatility have kept him in the forefront of contemporary Telugu Literary Scene.
ఉదాహరణలు
ఆంధ్ర పౌరుషము నుండి
గోదావరీ పావనోదార వాపూర మఖిలభారతము మాదన్న నాడు
తుంగభద్రా సముత్తుంగ రావముతోడ కవులగానము శృతి గలయునాడు
పెన్నానదీ సముత్పన్న కైరవదళ శ్రేణిలో తెల్గు వాసించునాడు
కృష్ణా తరంగ నిర్ణిద్రగానముతోడ శిల్పము తొలి పూజ సేయునాడు
అక్షరజ్ఞానమెరుగదో యాంధ్రజాతి
విమల కృష్ణానదీ సైకతములయందు
కోకిలపుబాట పిచ్చుకగూండ్లు గట్టి
నేర్చుకొన్నది పూర్ణిమా నిశలయందు
రామాయణ కల్పవృక్షం నుండి
ఆకృతి రామచంద్ర విరహాకృతి
కన్బొమ తీరు రామ చాపాకృతి
కన్నులన్ ప్రభు క్రుపాకృతి
కైశిక మందు రామదేహాకృతి
సర్వ దేహమున యందు రాఘవ వంశ మౌళి ధర్మాకృతి
కూరుచున్న విధమంతయు రామచంద్ర ప్రతిజ్ఞ మూర్తియై.
విశ్వేశ్వర శతకము నుండి
మీ దాతృత్వమొ తండ్రి దాతృతయొ మీమీ మధ్య నున్నట్టి లా
వాదేవీలకు నాదు బాధ్యతకు సంబంధంబు లేదిట్లు రా!
ఏదో లెక్కలు తేల్చుకో! మొఱటుతోనేలా? యొడల్ మండెనా
ఏదో వచ్చిన కాడి కమ్మెదను సుమ్మీ నిన్ను విశ్వేశ్వరా!
కిన్నెరసాని పాటల నుండి
నడవగా నడవగా నాతి కిన్నెరసాని
తొడిమ యూడిన పూవు పడతిలా తోచింది
కడు సిగ్గు పడు రాచకన్నెలా తోచింది
బెడగు పోయిన రత్నపేటిలా తోచింది.
కోకిలమ్మ పేళ్ళి నుండి
చిలుక తల్లి మహాన్వయంబున
నిలిచినవి సాంస్కృతిక వాక్కులు
కోకిలమ్మా తెలుగు పలుకూ
కూడబెట్టినదీ
మరొకటి
వెస స్వరాజ్యము వచ్చిన పిదప కూడ
సాగి ఇంగ్లీషు చదువునే చదివినట్లు
అంగనామణి పెండిలియాడి కూడ
ప్రాతచుట్టరికమునె రాపాడుచుండె
విశ్వనాధ గురించి
తన శిష్యుని గురించి గురువు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి ఇలా అన్నాడు
నా మార్గమ్మును కాదు, వీని దరయన్ నా తాత ముత్తాతలందే మార్గమ్మును కాదు; మార్గమదియింకేదో యనంగా వలెన్సామాన్యుండనరాదు వీని కవితా సమ్రాట్వ్త మా హేతువై,యీ మచ్ఛిష్యుని దా వరించినది, నేనెంతే ముదంబందెదన్
శ్రీశ్రీ ఇలా అన్నాడు
మాట్లాడే వెన్నెముకపాట పాడే సుషుమ్ననిన్నటి నన్నయభట్టునేటి కవి సామ్రాట్టుగోదావరి పలుకరింతకృష్ణానది పులకరింతకొండవీటి పొగమబ్బుతెలుగువాళ్ళ గోల్డునిబ్బుఅకారాది క్షకారాంతంఆసేతు మహికావంతంఅతగాడు తెలుగువాడి ఆస్తిఅనవరతం తెలుగువాడి ప్రకాస్తిఛందస్సు లేని ఈ ద్విపదసత్యానికి నా ఉపద